Sanju Samson : ఎట్ట‌కేల‌కు శాంస‌న్ కు ఛాన్స్

ఖుష్ క‌బ‌ర్ చెప్పిన బీసీసీఐ

Sanju Samson : భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) వెస్టిండీస్ లో ప‌ర్య‌టించే భార‌త క్రికెట్ జ‌ట్ల‌ను ప్ర‌క‌టించింది. టెస్టు టీమ్ తో పాటు వ‌న్డే జ‌ట్టుల‌ను వెల్ల‌డించింది. భార‌త జ‌ట్టు వ‌చ్చే నెల జూలైలో టీమిండియా ప‌ర్య‌టించ‌నుంది. ఇందులో భాగంగా 2 టెస్టులు, 3 వ‌న్డేలు, 5 టీ20 మ్యాచ్ ల సీరీస్ ఆడ‌నుంది. ప్ర‌స్తుతానికి టెస్టుతో పాటు వ‌న్డే జ‌ట్ల‌ను వెల్ల‌డించింది బీసీసీఐ.

ఈ ఏడాది భార‌త దేశంలో ఐసీసీ ప్ర‌పంచ వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌ర‌గ‌నుంది. ఇండియా ప్రాతినిధ్యం వ‌హించ‌నుంది. దీంతో ఇప్ప‌టి నుంచే ప్ర‌యోగాలు స్టార్ట్ చేసింది. అటు టి20 ఇటు వ‌న్డే ఫార్మాట్ ల‌కు స‌రిగ్గా స‌రిపోతాడ‌ని సంజూ శాంస‌న్(Sanju Samson) ను ఎంపిక చేసింది. శాంస‌న్ తో పాటు ఇషాన్ కిష‌న్ కు ప్ర‌యారిటీ ఇచ్చింది. ఈసారి వ‌న్డే సీరీస్ కు శాంస‌న్ తో పాటు రుతురాజ్ గైక్వాడ్ ను ఎంపిక చేయ‌డం ఒకింత విస్తు పోయేలా చేసింది.

ఇదిలా ఉండ‌గా గ‌త కొన్నేళ్లుగా బీసీసీఐ కేర‌ళ స్టార్ , రాజ‌స్థాన్ రాయ‌ల్స్ స్కిప్ప‌ర్ గా ఉన్న సంజూ శాంస‌న్ ను అడ‌పా ద‌డ‌పా ఎంపిక చేస్తూ వ‌చ్చింది. విచిత్రం ఏమిటంటే జ‌ట్టులో ఆట‌గాళ్లు ప‌దే ప‌దే ఆట ప‌రంగా పేల‌వ‌మైన ప్ర‌ద‌ర్శ‌న చేసినా కావాల‌ని వారిని కంటిన్యూ చేస్తూ వ‌చ్చింది.

దీంతో మాజీ ఆట‌గాళ్ల‌తో పాటు క్రికెట్ అభిమానులు పెద్ద ఎత్తున బీసీసీఐ తీరుపై, సెలెక్ట‌ర్లు అనుస‌రిస్తున్న వివ‌క్ష‌ను ఎండ‌గట్టారు. ఇదే విష‌యాన్ని మాజీ సెలెక్ట‌ర్ చేత‌న్ శ‌ర్మ జీ మీడియా స్టింగ్ ఆప‌రేష‌న్ లో బ‌య‌ట పెట్టాడు. కావాల‌ని శాంస‌న్ ను ప‌క్క‌న పెట్టామ‌ని చెప్ప‌డం క‌ల‌క‌లం రేపింది.

Also Read : Wagner Chief : ప్రిగోజిన్ వార్నింగ్ ర‌ష్యా అల‌ర్ట్

Leave A Reply

Your Email Id will not be published!