BCCI Invites : ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ ఎవరో
టెండర్ పిలిచిన బీసీసీఐ
BCCI Invite : ముంబై – వచ్చే ఏడాది ఐపీఎల్ కొనసాగనుంది. ఇప్పటికే ఆటగాళ్ల మినీ వేలానికి సిద్దం చేసింది బీసీసీఐ. ప్రతిసారి భారత్ లో ఈ వేలం పాట జరిగేది. కానీ ఈసారి అందుకు భిన్నంగా దుబాయ్ వేదికగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ హక్కుల వేలానికి ముహూర్తం ఖరారు చేసింది.
BCCI Invite Sponsors
ప్రస్తుతానికి టాటా కంపెనీ ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ గా ఉంది. గతంలో వివో , 2008లో డీఎల్ఎఫ్ ఉండేది. ఈసారి బీసీసీఐ(BCCI) టెండర్లను పిలిచింది. 2024 నుంచి 2028 వరకు స్పాన్సర్ హక్కులకు సంబంధించి ఈ వేలం పాట జరగనుంది. ఇప్పటి వరకు 2 సంవత్సరాలకు గాను బీసీసీఐతో టాటా కంపెనీ రూ. 600 కోట్లకు ఒప్పందం చేసుకుంది. దాని గడువు పూర్తి కానుంది.
ఇక టైటిల్ స్పాన్సర్ రైట్స్ కోసం ఆయా కంపెనీలు టెండర్ పత్రాలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇందుకు ఫీజుగా రూ. 5 లక్షలు నాన్ రిఫండబుల్ మొత్తాన్ని నిర్ణయించింది. వచ్చినా లేక రాక పోయినా ఆ డబ్బులు తిరిగి రావని అర్థం చేసుకోవాలి.
Also Read : Free Bus Scheme : బస్సులు ఫుల్ మహిళలు ఖుష్