Ajinkya Rahane : రోహిత్ కు షాక్ రహానేకు ఛాన్స్ ?
విండీస్ టూర్ కు బీసీసీఐ ప్లాన్
Ajinkya Rahane : రోహిత్ శర్మను కాదని అజింక్యా రహానేకు టెస్టు కెప్టెన్సీ దక్కబోతోందా అవుననే అంటున్నాయి క్రికెట్ వర్గాలు. 18 నెలల పాటు ఆటకు దూరంగా ఉన్నాడు రహానే. పేలవమైన ఆట తీరుతో జట్టుకు దూరమయ్యాడు. ఆ తర్వాత బీసీసీఐ మాజీ బాస్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశాడు. జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన ఆటగాళ్లు తిరిగి జాతీయ స్థాయిలో జరిగే దేశీ వాళీ పోటీలలో తప్పక ఆడాలని తమ ఆటను మెరుగు పర్చుకోవాలని సూచించాడు. ఈ మేరకు రహానే తనదైన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. ఆపై ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ 2023లో అద్భుమైన ఆట తీరును ప్రదర్శించాడు.
తన సహజ సిద్దమైన ఆట తీరుకు భిన్నంగా ఆడాడు రహానే. యువ ఆటగాళ్ల తో పాటు ధీటుగా దుమ్ము రేపాడు. తన జట్టు విజయాలలో కీలక పాత్ర పోషించాడు. ఈ తరుణంలో ఉన్నట్టుండి బీసీసీఐ ఇంగ్లండ్ లో జరిగిన ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ కు ఎంపిక చేసింది. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు అజింక్యా రహానే(Ajinkya Rahane). జట్టుకు చెందిన ఆటగాళ్లు ఒక్కరొక్కరు పెవిలియన్ దారి మళ్లినా తను మాత్రం అద్భుతంగా ఆడాడు.
తొలి ఇన్నింగ్స్ లో 89 రన్స్ , రెండో ఇన్నింగ్స్ లో 43 పరుగులు చేసి హయ్యస్ట్ స్కోరర్ గా నిలిచాడు. దీంతో వచ్చే నెలలో విండీస్ టూర్ కు వెళ్లాల్సి ఉంది భారత జట్టు. రోహిత్ , కోహ్లీకి విశ్రాంతి ఇవ్వాలని వారి స్థానంలో రహానేను కెప్టెన్ గా కోహ్లీకి బదులు పుజారాను ఎంపిక చేయాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం.
Also Read : Avinash Reddy CBI : సీబీఐ ముందుకు అవినాష్ రెడ్డి
