Pant Dhawan : రాహుల్ దూరం పంత్ కు అవ‌కాశం

వైస్ కెప్టెన్సీ రేసులో స్టార్ ప్లేయ‌ర్

Pant Dhawan  : ఎన్న‌డూ లేని రీతిలో భార‌త క్రికెట్ జ‌ట్టు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. యూఏఈ వేదిక‌గా జ‌రిగిన టీ20లో దాయాది పాకిస్తాన్ కొట్టిన దెబ్బ ఇంకా టీమిండియాను వీడ‌డం లేదు.

ఆ ప్ర‌భావం మ‌నోళ్ల‌ను ఇంకా వెంటాడుతున్న‌ట్లు ఉంది. స్వ‌దేశంలో కీవీస్ తో గెలిచినా అది విజ‌యంగా ప‌రిగ‌ణించ‌లేం. ఇక హాట్ ఫేవ‌రేట్ గా ద‌క్షిణాఫ్రికా టూర్ కు వెళ్లిన భార‌త జ‌ట్టు ఉన్న ప‌రువు పోగొట్టుకుంది.

ప్ర‌త్యేకించి ఒక్క టెస్టు గెలిచిన ఆనందం కొద్ది సేపే మిగిలింది. రాహుల్ ద్ర‌విడ్ హెడ్ కోచ్ త‌ర్వాత ఎలాంటి మార్పు క‌నిపించడం లేదు. స‌ఫారీ టూర్ పూర్తిగా పీడ‌క‌ల‌గా మారింది.

మూడు వ‌న్డేలు స‌మ‌ర్పించుకుని రెండు టెస్టుల్లో ఓడి పోయి అటు వ‌న్డే, ఇటు టెస్టు సీరీస్ కోల్పోయి ఒట్టి చేతుల్తో ఇండియాకు వ‌చ్చేసింది.

ఈ త‌రుణంలో వెస్టిండీస్ తో టీ20, వ‌న్డే సీరీస్ ఆడేందుకు సిద్ద‌మైంది. మ‌నోళ్లు ఇంట్లో పులులు బ‌య‌ట పిల్లులు అనే నానుడిని నిజం చేశార‌న్న అప‌వాదు మూట‌గ‌ట్టుకున్నారు.

ఇక గాయాల వీరుడు రోహిత్ శ‌ర్మ పూర్తి ఫిట్ నెస్ తో వ‌చ్చినా జ‌ట్టులో మునుప‌టి ఉత్సాహం క‌నిపించడం లేద‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి.

ఈ త‌రుణంలో వైస్ కెప్టెన్ గా ఉన్న కేఎల్ రాహుల్ దూరం కావ‌డంతో అత‌డి స్థానంలో రోహిత్ శ‌ర్మ‌కు జ‌త‌గా ఎవ‌రిని నియ‌మించాల‌నే దానిపై బీసీసీఐ(Pant Dhawan  )మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతోంది.

వ‌న్డే సీరీస్ కు శిఖ‌ర్ ధావ‌న్Pant Dhawan )ను తీసుకున్నా అత‌డికి కెప్టెన్ గా నిర్వ‌హించిన అనుభ‌వం ఉన్న‌ప్ప‌టికీ బోర్డు మాత్రం పంత్ వైపు మొగ్గు చూపుతున్న‌ట్లు స‌మాచారం. ఏది ఏమైనా ఎవ‌రిని మార్చినా జ‌ట్టు గెలిస్తే చాలంటున్నారు అభిమానులు.

Also Read : ఆ న‌లుగురిపై యువీ కీల‌క కామెంట్స్

Leave A Reply

Your Email Id will not be published!