Sanju Samson BCCI : శాంసన్ ను పట్టించుకోని బీసీసీఐ
కావాలని పక్కన పెడుతున్న కమిటీ
Sanju Samson ODI Squad : భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు నిర్వాకంపై సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. ఇప్పటికే బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ నోరు జారినా అన్నీ నిజాలే చెప్పాడని నమ్మడానికి వీలు లేదు. స్టింగ్ ఆపరేషన్ చేసిన జీ టీవీ గ్రూప్ పూర్తిగా ప్రస్తుతం బీజేపీకి మద్దతు ఇస్తోంది.
ఈ తరుణంలో ఆ పార్టీకి అండగా నిలిచిన వాళ్లు, కేంద్ర సర్కార్ తో దగ్గరగా ఉన్న వాళ్లకే ప్రయారిటీ లభిస్తోందన్న ఆరోపణలు లేక పోలేదు. టాలెంట్ ఉండీ జట్టులో ఎంపిక కోసం నానా తంటాలు పడుతున్నారు. వారిలో కేరళ స్టార్ సంజూ శాంసన్ మరొకరు సర్ఫరాజ్ అహ్మద్.
మరో వైపు మూడు ఫార్మాట్ లలో రాణించక పోయినా ఎంపిక చేస్తూ వస్తున్నారు కేఎల్ రాహుల్ ను. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఎందుకని సంజూ శాంసన్ ను (Sanju Samson ODI Squad) పక్కన పెట్టారనేది ఇప్పటికీ ఇంకా బయటకు చెప్పలేదు. ప్రస్తుతం ముంబై, గుజరాత్ కు చెందిన ఆటగాళ్ల హవా కొనసాగుతోంది. ఇంకో వైపు బీసీసీఐ బాస్ రోజర్ బిన్నీ అయినా మొత్తం అమిత్ షా కొడుకు జే షానే నడుపుతున్నాడనే విమర్శలు కూడా ఉన్నాయి.
ఇక స్టింగ్ ఆపరేషన్ లో చేతన్ శర్మ కూడా నోరు పారేసుకున్నాడు వ్యక్తిగతంగా సంజూ శాంసన్ పై. విచిత్రం ఏమిటంటే హార్దిక్ పాండ్యా, ఉమేష్ యాదవ్ , ఇషాన్ కిషన్ తరచుగా తన ఇంటికి వస్తుంటారని నోరు పారేసుకున్నాడు. దీనిపై మండిపడ్డారు ఫ్యాన్స్ . నీ ఇంటికి వస్తే నీకు సలాం చేస్తే జట్టులో ఎంపిక చేస్తావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : రాహుల్ ను వెనకేసుకు వచ్చిన రాహుల్