Yuzvendra Chahal : యుజ్వేంద్ర చాహల్ కు మళ్లీ పిలుపు
ఐపీఎల్ పర్పుల్ క్యాప్ రేసులో బౌలర్
Yuzvendra Chahal : ఏ మాత్రం అంచనాలు లేకుండా ముంబై వేదికగా జరుగుతున్న ఇండియన్ ప్రిమీయర్ లీగ్ -2022 రిచ్ టోర్నీలో ఎంటర్ అయ్యింది
కేరళ స్టార్ సంజూ శాంసన్ నేతృత్వంలోని రాజస్థాన్ రాయల్స్ . 14 మ్యాచ్ లకు గాను 9 మ్యాచ్ లలో విజయం సాధించి పాయింట్ల పట్టికలో 2వ స్థానంలో నిలిచింది.
ఈసారి ఎలాగైనా సరే ఐపీఎల్ టైటిల్ గెలవాలనే నిశ్చయంతో ఉంది. ఇక ఆ జట్టు సమిష్టిగా రాణించింది. అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు స్టార్ బౌలర్ , స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్.
ఈ ఏడాది ఫిబ్రవరి 12, 13వ తేదీలలో బెంగళూరు వేదికగా జరిగిన మెగా ఐపీఎల్ వేలంలో రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం, హెడ్ కోచ్ , శ్రీలంక క్రికెట్ దిగ్గజం కుమార సంగక్కర యుజ్వేంద్ర చాహల్ ను ఎంపిక చేసుకున్నారు.
భారీ ధరకు కొనుగోలు చేశారు. దీంతో తనపై నమ్మకం ఉంచిన మేనేజ్ మెంట్ కు ప్రధానంగా కోచ్ సంగక్కర, కెప్టెన్ శాంసన్ కు అండగా నిలిచాడు. జట్టు విజయాలలో కీలక పాత్ర పోషించాడు.
ఏకంగా ఐపీఎల్ లో అందరి జట్ల బౌలర్ల కంటే ఎక్కువ వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ రేసులో టాప్ లో నిలిచాడు. ఇంకా రెండు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఇప్పటికే ఐపీఎల్ చరిత్రలో అరుదైన ఫీట్ సాధించాడు యుజ్వేంద్ర చాహల్(Yuzvendra Chahal) .
26 వికెట్లు తీసిన బౌలర్ గా చరిత్ర సృష్టించాడు. గత కొంత కాలం పేలవమైన ఆట తీరుతో ఆకట్టుకోని చాహల్ ను భారత క్రికెట్ జట్టు సెలెక్షన్ కమిటీ పక్కన పెట్టింది.
కానీ ఈసారి ఐపీఎల్ లో సత్తా చాటడంతో మరోసారి స్వదేశంలో జరిగే టీ20 జట్టుకు చాహల్ ను ఎంపిక చేసింది.
Also Read : పుజారా పట్టు వదలని విక్రమార్కుడు