BCCI Selection Committee : టీమిండియా సెలెక్షన్ పై కసరత్తు
ఉండేది ఎవరో ఊడేది ఎవరోనని ఉత్కంఠ
BCCI Selection Committee : నెల రోజుల్లో ఆస్ట్రేలియాలో జరిగే టి20 వరల్డ్ కప్ లో పాల్గొనే టీమిండియా ఎంపికై బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తు చేస్తోంది(BCCI Selection Committee). యూఏఈ వేదికగా జరిగిన ఆసియా కప్ -2022 ముగిసింది. భారత జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది.
ఎవరు ఉంటారో ఎవరు ఉండోరనన్న ఉత్కంఠ నెలకొంది. సోమవారం కీలక మీటింగ్ ప్రారంభమైంది. చేతన్ శర్మ సారథ్యంలో కసరత్తు జరుగుతోంది. బుమ్రా, హర్షల్ పటేల్ ఫిట్ అయ్యారు.
వీరి ఎంపికకు ఢోకా లేదు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ఎంపిక దాదాపు ఖరారు అయినట్లే. హార్దిక్ పాండ్యా, యుజ్వేంద్ర చాహల్ కు ఢోకా లేదు.
కచ్చితంగా ఈ ఇద్దరికి చోటు దక్కనుందని(BCCI Selection Committee) సమాచారం. కీపర్ పరంగా చూస్తే దినేశ్ కార్తీక్ ఫినిషింగ్ టచర్ గా చోటు దక్కే ఛాన్స్ ఉంది. ఆసియా కప్ లో సూర్య కుమార్ యాదవ్ కు కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది.
రిషబ్ పంత్ , కార్తీక్ లేదా శాంసన్ లలో ఎవరు ఉంటారనేది ఉత్కంఠ నెలకొంది. ఆల్ రౌండర్ పరంగా పాండ్యాకు ఢోకా లేదు. ఆపరేషన్ కారణంగా రవీంద్ర జడేజా ను ఎంపిక చేయక పోవచ్చు.
అతడి స్థానంలో అక్షర్ పటేల్ ను ఎంపిక చేయనున్నారు. ఫినిషర్ గా పనికి వస్తాడని అనుకున్న దీపక్ హూడా ఆసియా కప్ లో రాణించక లేక పోయాడు.
బౌలింగ్ పరంగా చూస్తే భువీ, బుమ్రా, అర్ష్ దీప్ సింగ్ , దీపక్ చాహర్ , షమీ ఉన్నారు. వీరితో పాటు చాహల్, అశ్విన్ , రవి బిష్నోయ్ కూడా పరిగణలోకి తీసుకోనున్నారు.
ఇక స్టాండ్ బై గా శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్ , అర్ష్ దీప్ సింగ్ ను ఎంపిక చేసే ఛాన్స్ ఉంది.
Also Read : యూఎస్ ఓపెన్ విజేతగా కార్లోస్