Dinesh Karthik : కార్తీక్ కష్టం వరించిన అదృష్టం
మళ్లీ జాతీయ జట్టులోకి ఎంపికైన ఫినిషర్
Dinesh Karthik : జట్టులో స్థానం కోల్పోయాడు. ఇంకొకరైతే ఇంకెందుకని ఊరుకుంటారు. కానీ పట్టువదలని విక్రమార్కుడు ఈ దినేష్ కార్తీక్. జట్టులో చోటు కోల్పోవడంతో క్రికెట్ కామెంటేటర్ గా అవతారం ఎత్తాడు.
ఆపై ఐపీఎల్ 2022లో రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడాడు. ఆ జట్టు విజయాలలో కీలక పాత్ర పోషించాడు. బారీ పరుగులతో ఆకట్టుకున్నాడు. అంతే కాదు జట్టుకు ఫినిషర్ గా పేరు తెచ్చుకున్నాడు.
ఒక రకంగా చెప్పాలంటే దినేష్ కార్తీక్(Dinesh Karthik) చాలా కష్టపడ్డాడు. ఎలాగైనా సరే తాను జాతీయ జట్టులోకి రావాలని ఉందని, అందుకోసమే తాను కష్ట పడుతున్నానని చెప్పాడు.
రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన లీగ్ మ్యాచ్ లో ఓడిపోయేందుకు సిద్దంగా ఉన్న ఆర్సీబీకి ఊహించని రీతిలో అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో విజయాన్ని చేకూర్చి పెట్టాడు దినేష్ కార్తీక్.
అటు బ్యాటర్ గా రాణించడం, ఇటు వికెట్ కీపర్ గా సత్తా చాటడంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి సెలక్షన్ కమిటీ చైర్మన్ చేతన్ శర్మ స్వదేశంలో సౌతాఫ్రికా జట్టుతో జరిగే 5 మ్యాచ్ ల టీ20 సీరీస్ కు ఎంపిక చేశారు దినేష్ కార్తీక్ ను.
ఇప్పటికే తాజా, మాజీ ఆటగాళ్లు సైతం దినేష్ కార్తీక్(Dinesh Karthik) ను తీసుకోవాలని కోరారు. అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ఈసారి పలువురు ఆటగాళ్లకు మళ్లీ పిలుపు వచ్చింది.
వారిలో హార్దిక్ పాండ్యా, యుజ్వేంద్ర చాహల్, దినేష్ కార్తీక్ ఉండడం విశేషం. ఇక కాశ్మీర్ ఎక్స్ ప్రెస్ గా పేరొందిన సూపర్ ఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ కు మొదటిసారిగా జాతీయ జట్టులో చోటు దక్కడం విశేషం.
Also Read : అజ్జూ రికార్డును సమం చేసిన పుజారా