BCCI Short List World Cup : వ‌ర‌ల్డ్ క‌ప్ లో టీమిండియా షార్ట్ లిస్ట్

20 మంది ఆట‌గాళ్ల‌కు బీసీసీఐ చోటు

BCCI Short List World Cup : భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ముంబైలో త‌న అధికారిక కార్యాల‌యంలో కీల‌క స‌మావేశం జ‌రిగింది. సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంది. ఇక ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించే ఐసీసీ వ‌ర‌ల్డ్ క‌ప్ కు భార‌త్ ఆతిథ్యం ఇవ్వ‌నుంది. ఇదిలా ఉండ‌గా వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం బీసీసీఐ 20 మంది ఆట‌గాళ్ల‌తో ఎంపిక చేసిన‌ట్లు(BCCI Short List World Cup) స‌మాచారం. వీరిలో ఎవ‌రెవ‌రు ఉన్నార‌నే ఉత్కంఠ‌కు తెర దించింది.

ఈ ప్ర‌పంచ క‌ప్ అక్టోబ‌ర్ లో ప్రారంభం కానుంది. ఆ ఇర‌వై మందిలో ఎక్కువ‌గా ఉండే వాళ్ల‌లో వీరు ఉండే అవ‌కాశం ఉంది. ఇక ఆట‌గాళ్ల ప‌రంగా చూస్తే రోహిత్ శ‌ర్మ స్థానం ఖ‌రారైన‌ట్టే. జ‌ట్టుకు కెప్టెన్ గా ఉండ‌నున్నారు.

జ‌ట్టుకు ఓపెన‌ర్ గా ప‌నికొస్తాడు. ఇషాన్ కిష‌న్ బంగ్లా టూర్ లో రాణించాడు. వికెట్ కీప‌ర్, బ్యాట‌ర్ డ‌బుల్ సెంచ‌రీ చేశాడు. రోహిత్ తో క‌లిసి ఇన్నింగ్స్ ను ప్రారంభించేందుకు ఛాన్స్ ఉంది.

శుభ్ మ‌న్ గిల్ లేదా శిఖ‌ర్ ధావ‌న్ లో ఎవ‌రో ఒక‌రికి అవ‌కాశం ద‌క్క‌నుంది. ఓపెన‌ర్ల స్లాట్ లో గిల్ రెండో స్థానంలో ఉన్నారు. శ్రీ‌లంక టూర్ లో ధావ‌న్ ను ప‌క్క‌న పెట్టింది బీసీసీఐ. విరాట్ కోహ్లీకి ఢోకా లేదు. అత్య‌ధిక వ‌న్డేల‌లో పాల్గొన్న అనుభ‌వం ఉంది. శ్రేయ‌స్ అయ్య‌ర్ 2022లో బాగా రాణించాడు.

కొంత కాలం పాటు 11 మంది టీమ్ లో ఒక‌డిగా ఉన్నాడు. సూర్య కుమార్ యాద‌వ్ స్థానం త‌ప్పనిసరి. మిడిల్ ఆర్డ‌ర్ లో రాణిస్తున్నాడు. రిషబ్ పంత్ ఆడేది అనుమాన‌మే. ఇటీవ‌ల ర‌హ‌దారి ప్ర‌మాదానికి గుర‌య్యాడు. కేఎల్ రాహుల్ ఫామ్ లేమితో ఉన్నాడు. పాండ్యా రాక‌తో త‌న బాధ్య‌త‌ను కోల్పోయాడు.

హార్దిక్ పాండ్యాకు ఢోకాలేదు. ఒక‌వేళ ఇలాగే రాణిస్తే వ‌న్డే జ‌ట్టుకు కెప్టెన్ అయినా ఆశ్చ‌ర్య పోవాల్సిన ప‌ని లేదు. ర‌వీంద్ర జ‌డేజా కేంద్రంలోని బీజేపీతో స‌త్ సంబంధాలు క‌లిగి ఉన్నాడు. ఇత‌డి ప్లేస్ కు అనుమానం లేదు. ఇక సంజూ శాంస‌న్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. భార‌త క్రికెట్ లో అద్భుతంగా రాణిస్తూ వున్నా చోటు ద‌క్క‌డం లేదు.

కానీ వ‌ర‌ల్డ్ క‌ప్ లో తుది జ‌ట్టులో ఉంటాడ‌ని అంచ‌నా. ఆల్ రౌండ‌ర్ల ప‌రంగా చూస్తే వాషింగ్ట‌న్ సుంద‌ర్ , జ‌స్ ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహ‌ల్ , కుల్దీప్ యాద‌వ్ , మ‌హ్మ‌ద్ ష‌మీ, మ‌హ్మ‌ద్ సిరాజ్ , అర్ష్ దీప్ సింగ్ , భువ‌నేశ్వ‌ర్ కుమార్ , ఉమ్రాన్ మాలిక్ తుది 20 మంది లిస్టులో చోటు ద‌క్కించు కోనున్నారు.

Also Read : ప్ర‌పంచ క‌ప్ పై ఫోక‌స్ జ‌ట్టుపై న‌జ‌ర్

Leave A Reply

Your Email Id will not be published!