BCCI Take Care Pant : శస్త్ర చికిత్స కోసం పంత్ యుకేకు
పంపేందుకు సిద్దమన్న బీసీసీఐ
BCCI Take Care Pant : స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ పట్ల భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) తెగ ఉత్సాహాన్ని చూపిస్తోంది. ఎక్కువ ఫోకస్ పెట్టింది. గతంలో ఏ ఆటగాడికి ఇంతటి మర్యాద జరగలేదు. ఓ వైపు ఉత్తరాఖండ్ సర్కార్ మొత్తం ఖర్చును తామే భరిస్తామని ప్రకటించారు సీఎం పుష్కర్ సింగ్ ధామీ. ప్రస్తుతం డెహ్రాడూన్ లోని మ్యాక్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు పంత్.
ఇదే సమయంలో ఢిల్లీ , జిల్లా క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) పూర్తిగా పంత్ ఆరోగ్యానికి సంబంధించి పర్యవేక్షిస్తోంది. ఇదిలా ఉండగా ఒకవేళ ఆపరేషన్ అవసరమైతే చికిత్స కోసం రిషబ్ పంత్ ను(BCCI Take Care Pant) యుకేకు పంపించేందుకు బీసీసీఐ ఆలోచిస్తుందని స్పష్టం చేశారు డీడీసీఏ అధికారి.
బీసీసీఐ కార్యదర్శి జే షా స్వయంగా ఈ విషయంపై ఆరా తీస్తున్నారని , ఎప్పటికప్పుడు అవసరమైనా స్పందిస్తున్నారని తెలిపారు సదరు అధికారి. అవసరమని అనుకుంటే పంపేందుకు వెనుకాడేది లేదని పేర్కొనడం విశేషం. ఇదిలా ఉండగా డిసెంబర్ 30న జరిగిన కారు ప్రమాదంలో ప్రాణాలతో బయట పడ్డాడు రిషబ్ పంత్.
ఆయన ప్రయాణిస్తున్న కారు డివైడర్ ను ఢీకొట్టింది. దీంతో కారు అద్దాలను పగలగొట్టుకుని బయటకు వచ్చాడు. తీవ్ర గాయాలతో ఉన్న రిషబ్ పంత్ ను హర్యానా రోడ్డు ట్రాన్స్ పోర్టుకు చెందిన బస్సు డ్రైవర్ , కండక్టర్ కాపాడారు. అంబులెన్స్ కు ఫోన్ చేసి రక్షించారు. పంత్ ను మొదటగా రూర్కీ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడి నుంచి నేరుగా డెహ్రాడూన్ కు తరలించారు.
Also Read : పంత్.. డ్రైవర్ ను పెట్టుకోక పోతే ఎలా – కపిల్