BCCI Team India : భారత జట్టు ఇంగ్లండ్ టూర్ షెడ్యూల్
హిందీ, ఇంగ్లీష్ కామెంటేటర్ల జాబితా
BCCI Team India : భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తాజాగా ఇంగ్లాండ్ టూర్ కు సంబంధించి భారత జట్టు(BCCI Team India)ను ప్రకటించింది.ఇదే సమయంలో స్టార్ స్పోర్ట్స్ కామెంటేటర్ల ప్యానల్ కూడా డిక్లేర్ చేయడం విశేషం.
ఇందులో 13 మందితో కూడిన ప్యానెల్ ను ప్రకటించింది. ఇంగ్లీష్ కామెంటేటర్లలో హర్ష బోగ్లే, నాసర్ హుస్సేన్ , సంజయ్ మంజ్రేకర్ , గ్రేమ్ స్వాన్ ,
డేవిడ్ గ్రోవర్ , మైకెల్ ఆర్థర్ టన్ ఉన్నారు.
ఇక హిందీ కామెంటరీకి వస్తే వివేక్ రాజ్దాన్ , సెహ్వాగ్ , అజయ్ జడేజా, సాబా కరీమ్ , కైఫ్ , నెహ్రా, అజిత్ అగార్కర్ వ్యవహరిస్తారు. ఇదిలా ఉండగా
భారత క్రికెట్ జట్టు(BCCI Team India) ఇంగ్లండ్ తో ఏకైక టెస్టు ఆడేందుకు రెడీ అయ్యింది.
మరో వైపు గాయం కారణంగా కేఎల్ రాహుల్ తప్పుకుంటే ఉన్నట్టుండి కరోనా పాజిటివ్ తేలడంతో కోహ్లీ దూరమయ్యాడు. గత ఏడాది 5 టెస్టుల
సీరీస్ లో భాగంగా భారత్ 4 టెస్టులు ఆడింది.
ఐదో టెస్టు ను ఆడకుండా కరోనా సాకు చెప్పి దుబాయి లో జరిగిన ఐపీఎల్ 2021 రిచ్ లీగ్ లో జాయిన్ అయ్యారు. దీనిపై అప్పట్లో పెద్ద విమర్శలు వచ్చాయి.
దీనిపై ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సీరియస్ అయ్యింది. ఐసీసీకి ఫిర్యాదు చేసింది. కానీ ఫలితం లేక పోయింది. ఆ మిగిలి పోయిన టెస్టునే ఇప్పుడు
ఆడనుంది భారత జట్టు.
ఇదే సమయంలో భారత్ టెస్టుతో పాటు మూడు వన్డేలు, మూడు టి20 మ్యాచ్ లు ఆడుతుంది. జట్టు పరంగా చూస్తే రోహిత్ శర్మ కెప్టెన్ .శుభ్ మన్ గిల్ , విరాట్ , అయ్యర్ , విహారి, పుజారా, పంత్ , భరత్ , జడేజా, అశ్విన్ , ఠాకూర్ , షమీ, బుమ్రా, సిరాజ్ , ఉమేష్ , కృష్ణ ఉన్నారు.
ఇక షెడ్యూల్ పరంగా చూస్తే .. ఈనెల 24 నుంచి 27 దాకా లీసెస్టర్ తో నాలుగు రోజుల మ్యాచ్ ఆడుతుంది. జూలై 1 నుంచి 5 వరకు రీషెడ్యూల్ టెస్టు మ్యాచ్ ఎడ్జ్ బాస్టన్ లో జరుగుతుంది.
జూలై 7న తొలి టి20 , సౌతాంప్టన్ లో , 9 బర్మింగ్ హోం లో రెండో టీ20 , 10న నాటింగ్ హోమ్ లో మూడో టి20 మ్యాచ్ ఆడుతుంది. ఇక
జూలై 12న లండన్ లో తొలి వన్డే , 14న రెండో వన్డే , మూడో వన్డే మాంచెస్టర్ లో 17న ఆడుతుంది.
Also Read : టి20 ర్యాంకింగ్స్ లో దినేష్..చాహల్