Tammy Beaumont : ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఇవాళ 2021కి సంబంధించి టీ20 మహిళల అత్యుత్తమ ప్లేయర్ అవార్డును డిక్లేర్ చేసింది. ఇంగ్లండ్ కు చెందిన స్టార్ ప్లేయర్ టామీ బ్యూమాంట్(Tammy Beaumont) ఉత్తమ ప్లేయర్ గా ఎంపిక చేసినట్లు ప్రకటించింది.
ఇదిలా ఉండగా టామీ బ్యూమాంట్ వికెట్ కీపర్ గా, బ్యాటర్ గా ఉన్నారు. ప్రపంచ మహిళా క్రికెట్ లో అత్యుత్తమ విమెన్ క్రికెటర్ గా ఎంపిక చేసినట్లు ఐసీసీ వెల్లడించింది.
టీ20 ఫార్మాట్ లో ఇంగ్లండ్ జట్టు తరపున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా చరిత్ర సృష్టించింది. న్యూజిలాండ్ తో జరిగిన సీరీస్ లో బ్యూమాంట్(Tammy Beaumont) టాప్ స్కోరర్ గా నిలిచింది.
మూడు మ్యాచ్ లలో 102 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది సీరీస్ గా ఎంపికైంది. అంతే కాకుండా రెండో మ్యాచ్ లో 53 బంతులు ఎదుర్కొని 63 పరుగులు చేసింది. పవర్ ప్లేలో రెండు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ జట్టును విజేతగా నిలిపిందని ఐసీసీ పేర్కొంది.
లోయర్ ఆర్డర్ కుప్ప కూలినా భారత జట్టుతో జరిగిన మ్యాచ్ లో హాఫ్ సెంచరీతో సత్తా చాటిందని ప్రశంసించింది. ఇంగ్లండ్ టూర్ లో 113 పరుగులతో సీరీస్ లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా నిలిచారు.
సీరీస్ ప్రారంభ మ్యాచ్ లో 97 పరుగులతో అద్భుతంగా రాణించిందని ఐసీసీ వెల్లడించింది. ఒక రకంగా ఇంగ్లండ్ జట్టుకు కీలక విజయాలు అందించడంలో టామీ బ్యూమాంట్ కీలక పాత్ర పోషించిందని స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా పురుషులకు సంబంధించి పాకిస్తాన్ వికెట్ కీపర్, ఓపెనర్ రిజ్వాన్ ను అత్యుత్తమ అవార్డుకు ఎంపిక చేసింది ఐసీసీ.
Also Read : కోహ్లీని కావాలనే తప్పించారు