Ben Stokes : పాకిస్తాన్ బాధితుల కోసం బెన్ స్టోక్స్ విరాళం

ఇంగ్లండ్ క్రికెటర్ ఔద‌ర్యానికి క్రీడాలోకం ఫిదా

Ben Stokes : ఇంగ్లండ్ క్రికెట‌ర్ల‌ను మెచ్చుకోకుండా ఉండ‌లేం. ఎందుకంటే సాయం చేయ‌డంలో, విరాళాలు ప్ర‌క‌టించ‌డంలో త‌మ‌దైన ముద్ర వేస్తున్నారు. ఇప్ప‌టికే ఇంగ్లండ్ టి20 కెప్టెన్ , స్టార్ బ్యాట‌ర్ జోస్ బ‌ట్ల‌ర్ పాకిస్తాన్ లో ఇటీవ‌ల భారీగా వ‌ర‌ద‌లు వ‌చ్చాయి. ల‌క్ష‌లాది మంది నిరాశ్ర‌యులుగా మారారు.

ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌లు దేశాలు, ఐక్య రాజ్య స‌మితి ఆధ్వ‌ర్యంలో సాయం చేశాయి. ఈ త‌రుణంలో పాకిస్తాన్ లో చాలా ఏళ్ల త‌ర్వాత ఇంగ్లండ్ ప‌ర్య‌టిస్తోంది. ఇందులో భాగంగా మ్యాచ్ ల సంధ‌ర్భంగా ఇచ్చే ఫీజును మొత్తం పాకిస్తాన్ ప్ర‌భుత్వానికి బాధితుల సాయం కోసం విరాళంగా ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాడు.

కెప్టెన్ బాట‌లోనే మ‌రో స్టార్ ఆట‌గాడు బెన్ స్టోక్స్ చేరి పోయాడు. తాజాగా తాను కూడా పాకిస్తాన్ కు విరాళం ఇస్తున్న‌ట్లు వెల్ల‌డించాడు. ప్ర‌స్తుతం మూడు టెస్టుల సీరీస్ కోసం పాకిస్తాన్ లో ప‌ర్య‌టిస్తోంది ఇంగ్లండ్ జ‌ట్టు. ఇదిలా ఉండ‌గా త‌నకు మ్యాచ్ ల ద్వారా వ‌చ్చే మొత్తం ఫీజును బాధితుల కోసం ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాడు బెన్ స్టోక్స్(Ben Stokes) .

పాకిస్తాన్ దేశ చ‌రిత్ర‌లో 75 ఏళ్ల కాలంలో ఎన్న‌డూ లేని రీతిలో వ‌ర‌ద‌లు బీభ‌త్సం సృష్టించాయి. దాదాపు అక్క‌డి ప్ర‌భుత్వ అంచ‌నా ప్ర‌కారం ఏకంగా ఏడున్న‌ర ల‌క్ష‌ల మందికి పైగా నిరాశ్ర‌యులు అయిన‌ట్లు స‌మాచారం. ఇదిలా ఉండ‌గా పాకిస్తాన్ లో ప‌ర్య‌టిస్తున్నందుకు గాను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు బెన్ స్టోక్స్ కు రూ. 37 ల‌క్ష‌లు అందుకుంటాడు.

ఈ మొత్తాన్ని పాకిస్తాన్ బాధితుల కోసం అంద‌జేయ‌నున్నాడు. బాధితుల కోసం సాయం ప్ర‌క‌టించిన బెన్ స్టోక్స్(Ben Stokes) కు పాకిస్తాన్ ప్ర‌ధాన మంత్రి షెహ‌బాజ్ ష‌రీఫ్, మాజీ ప్ర‌ధాని, మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ తో పాటు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మ‌న్ ర‌మీజ్ ర‌జా ధ‌న్య‌వాదాలు తెలిపారు.

Also Read : నాకౌట్ కు దూసుకెళ్లిన బ్రెజిల్

Leave A Reply

Your Email Id will not be published!