Ben Stokes : బెన్ స్టోక్స్ సంచలన నిర్ణయం
వన్డేల నుంచి తప్పుకుంటున్నట్లు డిక్లేర్
Ben Stokes : ఇంగ్లండ్ క్రికెట్ కు ఊహించని షాక్. ప్రపంచ క్రికెట్ లో టాప్ బ్యాటర్ గా పేరొందిన బెన్ స్టోక్స్(Ben Stokes) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అనూహ్యంగా తాను వన్డేల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.
సఫారీతో డర్హమ్ తో మంగళవారం జరిగే వన్డే మ్యాచ్ తనకు చివరిదని తెలిపారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు బెన్ స్టోక్స్. ఇదిలా ఉండగా బెన్ స్టోక్స్ ఇప్పటి దాకా 104 వన్డేలు ఆడాడు 2,919 పరుగులు చేశాడు.
ఇందులో 3 సెంచరీలు 21 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మరో వైపు జో రూట్(Joe Root) నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నాక ఇంగ్లండ్ సౌత్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఊహించని రీతిలో బెన్ స్టోక్స్ కు కెప్టెన్ గా ఎంపిక చేసింది.
టెస్టు జట్టు బాధ్యతలు అప్పగించంది. న్యూజిలాండ్ తో జరిగిన మూడు టెస్టుల సీరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. 9 సంవత్సరాల తర్వాత ఇంగ్లండ్ క్వీన్ స్వీప్ చేయడం ఇదే మొదటిసారి కావడం విశేషం.
ఇదిలా ఉండగా మంచి ఫామ్ లో ఉన్న బెన్ స్టోక్స్(Ben Stokes) ఉన్నట్టుండి వన్డేల నుంచి తప్పుకోవడం పెద్ద చర్చకు దారి తీసింది. ఇక స్టోక్స్ పూర్తి పేరు బెంజమిన్ ఆండ్రూ స్టోక్స్. 4 జూన్ 1991లో పుట్టాడు.
మూడు ఫార్మాట్ లలో అద్భుతంగా రాణించాడు. జట్టు విజయాలలో కీలక పాత్ర పోషించాడు. డర్హమ్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇండియన్ ప్రిమీయర్ లీగ్ లో పూణె సూపర్ జైంట్ , రాజస్తాన్ రాయల్స్ తరపున ఆడాడు.
న్యూజిలాండ్ లో పుట్టాడు. చిన్న తనంలో ఇంగ్లండ్ కు వెళ్లాడు. 2011లో వన్డే , టి20 మ్యాచ్ లు ఆరంభించాడు. 2019లో ప్రపంచ కప్ గెలిచిన జట్టులో కీలక పాత్ర పోషించాడు.
Also Read : ఇండియాకు ఐపీఎల్ గిఫ్ట్ గా ఇచ్చా – లలిత్ మోదీ