Bernard Arnault Elon Musk : ప్రపంచ కుబేరుల్లో బెర్నార్డ్..మస్క్ టాప్
నెంబర్ 2లో నిలిచిన టెస్లా చైర్మన్
Bernard Arnault Elon Musk : టెస్లా చైర్మన్ , ట్విట్టర్ బాస్ ఎలాన్ మస్క్ ప్రపంచ ధనవంతుల్లో రెండవ స్థానంలో నిలిచారు. అత్యంత శక్తివంతమైన కుబేరుల జాబితాను ఫోర్బ్స్ ప్రకటించింది. ట్విట్టర్ ను కొనుగోలు చేశాక మస్క్ కు చెందిన టెస్లా షేర్లతో పాటు ట్విట్టర్ షేర్లు కూడా పడి పోయాయి.
దీంతో నెంబర్ వన్ లో ఉండాల్సిన ఎలాన్ మస్క్ రెండో స్థానంతో సరి పెట్టుకున్నాడు. ఇటీవలే మైక్రో బ్లాగింగ్ సంస్థ ట్విట్టర్ ను రూ. 4,400 కోట్లకు కొనుగోలు చేశారు టెస్లా చైర్మన్. ఇప్పటికే $200 బిలియన్లకు పైగా తగ్గింది. లగ్జరీ బ్రాండ్ లూయిస్ విట్టన్ మాతృ సంస్థ ఎల్వీఎంహెచ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ బెర్నాల్డ్ ఆర్నాల్డ్(Bernard Arnault) ప్రపంచంలో నెంబర్ వన్ లో నిలిచారు.
ఆర్నాల్డ్ ఫోర్బ్స్ జాబితాలో $185.3 బిలియన్ల నికర విలువతో అగ్రస్థానంలో నిలిచారు. ఎలాన్ మస్క్ సెప్టెంబర్ 2021 నుండి అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ కూడా పోటా పోటీగా ధనవంతుల జాబితాలో టాప్ స్థానాల్లో కొనసాగుతూ వచ్చార. 2022లో టెస్లా షేర్లు రెండేళ్లలో కనిష్ట స్థాయికి పడి పోయినందు వల్ల ఎలాన్ మస్క్ నికర విలువ ఇప్పటికే $200 బిలియన్లకు పైగా పడి పోయింది.
విద్యుత్ కార్ల తయారీదారు తన సంపదలో ఎక్కువ భాగాన్ని కలిగి ఉన్నారు. యుఎస్ వెలుపల అతి పెద్ద మార్కెట్ అయిన చైనాలో కోవిడ్ సంబంధిత ఆంక్షలతో పోరాడుతున్నారు. మరో వైపు ట్విట్టర్ ను టేకోవర్ చేశాక ఎలాన్ మస్క్(Elon Musk) ఏకంగా 60 శాతం మంది ఉద్యోగులను తొలగించడం కలకలం రేపింది. తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నారు.
Also Read : ఉద్యోగుల తొలగింపుపై అమెజాన్ ఫోకస్