Mark Ruffalo : మస్క్ ట్విట్టర్ ను వదిలేస్తే బెటర్ – రుఫెలో
హాలీవుడ్ నటుడు షాకింగ్ కామెంట్స్
Mark Ruffalo : మైక్రో బ్లాగింగ్ సంస్థ ట్విట్టర్ ను టేకోవర్ చేసుకున్న టెస్లా సిఇఓ, చైర్మన్ ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయాలు తీసుకుంటూ షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే ట్విట్టర్ లో 50 శాతానికి పైగా ఉద్యోగులను తొలగించాడు. ఆయనపై ఉద్యోగులతో పాటు ఇతరులు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ తరుణంలో ప్రముఖ హాలీవుడ్ నటుడు మార్క్ రుఫెలో(Mark Ruffalo) షాకింగ్ కామెంట్స్ చేశాడు. ట్విట్టర్ వేదికగా వెంటనే ట్విట్టర్ ను ఎలాన్ మస్క్ విడిచి పెడితే బెటర్ అని సూచించాడు. ఇది కలకలం రేపింది. దీనిపై వెంటనే స్పందించాడు ఎలాన్ మస్క్. రోజు రోజుకు మస్క్ తన విశ్వసనీయతను కోల్పోతున్నాడని పేర్కొన్నాడు.
సంస్థను భారీ ధరకు కొనుగోలు చేసినా దానిని నమ్ముకుని, సంస్థ ఉన్నతి కోసం ప్రయత్నం చేస్తున్న ఎంప్లాయిస్ ను, టాప్ ఎగ్జిక్యూటివ్ స్ , బోర్డు డైరెక్టర్లను ఎలా తొలగిస్తారంటూ ప్రశ్నించారు. దీని వల్ల సంస్థకు ఉన్న క్రెడిబిలిటీ పోతుందనే విషయం గుర్తించాలన్నారు. ఈ సందర్బంగా మార్క్ రుఫెలో ఇలా రాశాడు.
డియర్ ఎలాన్ మస్క్ దయచేసి మర్యాద కోసమైనా ట్విట్టర్ నుండి బయట పడండి. అసలు ఉద్యోగం చేసే వారికి కీలక బాధ్యతలను అప్పగించాలని సూచించాడు. స్పేస్ ఎక్స్ లను నడుపుతూ ఉండండి. కానీ మీకు ఉన్న క్రెడిబిలిటినీ మీరే నాశనం చేసుకుంటున్నారంటూ హెచ్చరించారు.
మీ విలువైన సూచనలను పాటిస్తానంటూ ఎలాన్ మస్క్ పేర్కొనడం విశేషం. హాలీవుడ్ నటుడు రుఫెలో చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
Also Read : నెల లోపు భారత్ లో ట్విట్టర్ బ్లూ – మస్క్