Anurag Thakur : మీడియా గీత దాటితే జాగ్ర‌త్త – ఠాకూర్

దేశానికి భంగం క‌లిగిస్తే ఊరుకోమ‌ని వార్నింగ్

Anurag Thakur Media : కేంద్ర స‌మాచార‌, ప్ర‌సార‌, క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ నిప్పులు చెరిగారు. ఆయ‌న ఒక ర‌కంగా మీడియాను హెచ్చ‌రించారు. భార‌త దేశానికి సంబంధించిన స‌మ‌గ్ర‌త‌కు ముప్పు క‌లిగించే క‌థ‌నాల‌ను ప్ర‌చురించినా లేదా ప్ర‌సారం చేసినా లేదా అలాంటి వాటికి ప్ర‌యారిటీ ఇచ్చినా ఊరుకోబోమని స్ప‌ష్టం చేశారు కేంద్ర మంత్రి(Anurag Thakur Media). ప్ర‌ముఖ మ‌ల‌యాళ దిన‌ప‌త్రిక మాతృభూమి శ‌తాబ్ది ఉత్స‌వాల్లో అనురాగ్ ఠాకూర్ ప్ర‌త్యేక అతిథిగా పాల్గొని ప్ర‌సంగించారు.

వాస్త‌వాలు ప‌విత్ర‌మైన‌వ‌ని అభిప్రాయాల‌కు తావు లేద‌న్న వాస్త‌వాన్ని గుర్తించాల‌న్నారు. దేశ స‌మగ్ర‌త‌కు భంగం క‌లిగించే క‌థ‌నాల‌కు చోటు క‌ల్పించ‌కుండా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. దేశంలోని మీడియా సంస్థ‌లు దీనిని గుర్తించి స‌హ‌క‌రించాల‌ని కోరారు. నాసిర‌కం , అశాస్త్రీయ‌మైన అభిప్రాయాలు , లోప‌ల లేదా విదేశాల నుండి ఉచితంగా వ‌స్తుంటాయ‌ని కానీ తీసుకునే దానిని బ‌ట్టి ఉంటుంద‌న్నారు అనురాగ్ ఠాకూర్.

అయితే దేశానికి సంబంధించి ప్ర‌జాస్వామ్య స్వ‌భావాన్ని నాశ‌నం చేయ‌లేవ‌న్నారు. భార‌త స‌మ‌గ్ర‌త‌కు ముప్పు క‌లిగించే అవ‌కాశం ఉన్న ఇటువంటి స్వ‌రాలు, క‌థ‌నాల‌కు ఉద్దేశ పూర్వ‌కంగా లేదా అనుకోకుండా స్పేస్ ఇవ్వ‌కూడ‌ద‌ని ఆ బాధ్య‌త మీ అంద‌రిపై ఉంద‌న్నారు కేంద్ర మంత్రి. శ‌నివారం జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపాయి. 

భార‌త దేశం ప్ర‌జాస్వామ్యానికి త‌ల్లి లాంటింద‌ని చెప్పారు అనురాగ్ ఠాకూర్(Anurag Thakur). ప్ర‌పంచంలోనే అత్యంత స్వేచ్ఛ క‌లిగిన దేశం ఏదైనా ఉందంటే అది ఇండియానేన‌ని పేర్కొన్నారు. కొంద‌రు ప‌నిగ‌ట్టుకుని విమ‌ర్శ‌లు చేయ‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌ని సూచించారు.

Also Read : బీహార్ యూట్యూబ‌ర్ అరెస్ట్

Leave A Reply

Your Email Id will not be published!