Bhagat Singh Comment : ‘షహీద్’ కు అరుదైన గౌర‌వం

చండీగ‌ఢ్ ఎయిర్ పోర్టుకు పేరు

Bhagat Singh Comment : చిన్న‌త‌నంలోనే పోరాటాన్ని ప్రేమించిన వాడు. ప్రాణం కంటే దేశం గొప్ప‌ద‌ని న‌మ్మిన‌వాడు. జాతి విముక్తి కోసం, ఆంగ్లేయుల క‌బంధ హ‌స్తాల నుండి ర‌క్షించేందుకు ఏకంగా ప్రాణాల‌ను అర్పించిన వాడు. ఉరి కొయ్య‌ల‌ను ముద్దాడిన వాడు స‌ర్దార్ ష‌హీద్ భ‌గ‌త్ సింగ్(Bhagat Singh).

ఈ పేరు చెబితే విప్ల‌వం గుర్తుకు వ‌స్తుంది. నా దేశం కోసం నేను చ‌నిపోయిందుకు సిద్దంగా ఉన్నానంటూ ధైర్యంగా ప్ర‌క‌టించిన ధీశాలి. విప్లవ యోధుడు భ‌గ‌త్ సింగ్.

సెప్టెంబ‌ర్ 28న భ‌గ‌త్ సింగ్ జ‌యంతి. కానీ ఇవాళ ఎందుకు ఆయ‌న‌ను మ‌రోసారి త‌ల్చు కోవాల్సి వ‌స్తోందంటే. గ‌త కొంత కాలంగా భ‌గ‌త్ సింగ్ పేరును

చండీగ‌ఢ్ ఎయిర్ పోర్ట్ కు పెట్టాల‌ని కోరుతూ వ‌చ్చారు పంజాబ్ సీఎం భ‌గ‌వంత్ మాన్.

పేరు మార్చాలంటే త‌ప్ప‌నిస‌రిగా కేంద్రం అనుమ‌తి ఉండాల్సిందే. రైళ్లు, పోర్టులు, విమాన‌యానాలు, స‌ముద్రాలు, గ‌నులు, వ‌జ్రాల‌న్నీ కేంద్ర ఆధీనంలో ఉంటాయి.

ఇక ఇక్క‌డ ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించాల్సింది పంజాబ్ సీఎం గురించి. మ‌నోడికి ష‌హీద్ భ‌గ‌త్ సింగ్ అంటే పంచ ప్రాణం. ఆయ‌న ప్ర‌తిరోజూ ష‌హీద్ ను పిలుస్తూనే ఉంటారు.

ఆయ‌ను స్మ‌రించు కుంటూనే ఉంటారు. అంత‌లా మాన్ లీన‌మ‌య్యారు. త‌ను పార్ల‌మెంట్ లో ఎంపీగా ఉన్న స‌మ‌యంలో, ఆ త‌ర్వాత అసెంబ్లీ ఎన్నిక‌ల

ప్ర‌చారంలో సైతం భ‌గ‌త్ సింగ్ ను(Bhagat Singh) పదే ప‌దే ప్ర‌స్తావించారు.

అఖండ మెజారిటీతో గెలిపించిన ప్ర‌జ‌ల‌ను చైత‌న్య‌వంతం చేయ‌డంలో ఆయ‌న ష‌హీద్ వాడిన స్లోగ‌న్ (నినాదం)ను వాడారు. అదే ఇంకిల్వాబ్ జిందాబాద్ (విప్ల‌వం వ‌ర్దిల్లాలి). ఆయ‌న సీఎంగా కొలువు తీరాక త‌న ప్ర‌మాణ స్వీకారాన్ని ష‌హీద్ పుట్టిన కొంగ‌ర్ క‌లాన్ లో నిర్వహించారు.

పంజాబ్ చ‌రిత్ర‌లో ఇదో అపూర్వ‌మైన ఘ‌ట్టం. అన్ని ప్ర‌భుత్వాలు రాజ్ భ‌వ‌న్ లో ప్ర‌మాణం చేస్తే భ‌గ‌వంత్ మాన్ ఇక్క‌డ చేశాడు. ఇది ప‌క్క‌న పెడితే భ‌గ‌త్ సింగ్ పేరును చండీగ‌ఢ్ ఎయిర్ పోర్టుకు పెట్టాల‌ని కోరుతూ లేఖ రాశాడు.

ఇదిలా ఉండగా సీఎం ప్ర‌య‌త్నం ఫ‌లించింది. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ 93వ మ‌న్ కీ బాత్ సంద‌ర్భంగా జాతిని ఉద్దేశిస్తూ ప్ర‌సంగించారు.

దేశం కోసం బ‌లిదానం చేసిన ష‌హీద్ భ‌గ‌త్ సింగ్ కు నివాళులు అర్పించారు. అంతే కాదు చండీగ‌ఢ్ విమానాశ్ర‌యానికి భ‌గ‌త్ సింగ్ పేరు పెడుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

ఇది నిజ‌మైన దేశ భ‌క్తికి నివాళిగా పేర్కొన‌డంలో త‌ప్పు లేదు. రాజ‌కీయాల‌ను పక్క‌న పెడితే దేశం విస్మ‌రించ‌ని యోధులు ఎంద‌రో ఉన్నారు. వాళ్లు త‌మ

వ్య‌క్తిత్వాల‌తో ఎల్ల‌ప్ప‌టికీ ప్ర‌భావితం చేస్తూనే ఉంటారు.

ఆయ‌న మ‌ర‌ణించి ఏళ్ల‌వుతున్నా నేటికీ త‌ర త‌రాలుగా ష‌హీద్ కోట్లాది మందిని ప్ర‌భావితం చేస్తూనే ఉన్నారు. సూర్య చంద్రులు ఉన్నంత కాలం భ‌గ‌త్ సింగ్ విస్మ‌రించ‌ని యోధాను యోధుడు.

ష‌హీద్ కు లాల్ స‌లాం చెబుదాం. భగ‌వంత్ మాన్ తో పాటు మోదీకి అభినంద‌న‌లు.

Also Read : చిన్నారిని యుఎన్ రాయ‌బారిగా చేయండి

Leave A Reply

Your Email Id will not be published!