Bhagat Singh : ప్రాణం కంటే దేశం గొప్ప‌ది

ఉరి కొయ్య‌ల‌ను ముద్దాడిన ధీరుడు

Bhagat Singh : చావంటే కొంద‌రికి భ‌యం. జీవితం అంటే వారికి ఓ వ్య‌స‌నం. కానీ మ‌రికొంద‌రికి మాత్రం త్యాగం. అలాంటి వారిలో మొద‌టి వ్య‌క్తి స‌ర్దార్ ష‌హీద్ భ‌గ‌త్ సింగ్(Bhagat Singh). దేశం కోసం, స్వేచ్చ కోసం త‌న య‌వ్వ‌నాన్ని, కాలాన్ని , జీవితాన్ని ప‌ణంగా పెట్టిన యోధుడు.

ఆనాటి స్వాతంత్ర పోరాటంలో మ‌హాత్మా గాంధీ అహింస‌ను న‌మ్ముకుంటే. భ‌గ‌త్ సింగ్ హింసోన్మాదాన్ని ఆచ‌రించాడు.

దోపిడీ దారుల్ని ప‌క్క‌న పెట్ట‌గ‌ల‌దేమో కానీ మోసాన్ని, వివ‌క్ష‌ను, దోపిడీని నిర్మూలించ లేద‌ని స్ప‌ష్టం చేశాడు.

ఆనాటి ప‌రిస్థితుల్లో ఒక వేళ గ‌ట్టిగా ఆంగ్లేయుల్ని గాంధీ కోరి ఉంటే భ‌గ‌త్ సింగ్..రాజ్ గురు..సుఖ్ దేవ్ బ‌తికే వారు.

కానీ అలా జ‌ర‌గ‌లేద‌ని వీరుల్ని ప్రేమించే, ఆరాధించే వాళ్లు నేటికీ న‌మ్ముతారు.

ఏది ఏమైనా ఏ హింస‌ను వ‌ద్ద‌న్నాడు అదే హింస‌కు బ‌లై పోయాడు గాంధీ.

భ‌గ‌త్ సింగ్ ప‌ట్ల విచిత్ర‌మైన వైఖ‌రిని అనుస‌రించాడ‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. దేశం కంటే ప్రాణం గొప్ప‌ద‌ని చాటాడు భ‌గ‌త్ సింగ్(Bhagat Singh).

త‌ద‌నంత‌ర కాలంలో గాంధీ భ‌గ‌త్ సింగ్ దేశ భ‌క్తిని స‌దా కీర్తించే వ్య‌క్తిగా నిలిచాడ‌ని పేర్కొన్నాడు.

ఈ సంద‌ర్భంగా మ‌హాత్మడు ఓ మాట‌న్నాడు. ఎవ‌రినైనా ఉరి కంబం ఎక్కించాలంటే నా మ‌న‌స్సాక్షి ఒప్పుకోద‌న్నాడు.

దేవుడు ఒక్క‌డే ప్రాణాన్ని తీసుకోగ‌లడ‌ని పేర్కొన్నాడు. భ‌గ‌త్ సింగ్ ఉరి త‌ర్వాత దేశంలో యువ‌త‌కు వారంతా ఆద‌ర్శ ప్రాయులుగా మారారు.

2008 ఆగ‌స్టు 15న భార‌త పార్ల‌మెంట్ లో ఇందిరా గాంధీ, సుభాష్ చంద్ర బోస్ తో పాటు భ‌గ‌త్ సింగ్ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేశారు.

పంజాబ్ లోని ఖ‌ట్క‌ర్ క‌లాన్ లో భ‌గ‌త్ సింగ్ , సుఖ్ దేవ్ , రాజ్ గురుల స్మృతికి చిహ్నంగా స్మార‌క స్థూపాన్ని ఏర్పాటు చేశారు.

మార్చి 23న వేలాది మంది నివాళులు అర్పిస్తారు. ఉప‌ఖండంలో మొద‌టి అమ‌ర వీరుడుగా భ‌గ‌త్ సింగ్ ను పేర్కొంది దేశం. ఆయ‌న‌పై ఎన్నో సినిమాలు వ‌చ్చాయి.

ఉర్దూ, దేశ భ‌క్తి గీతాలు ఎన్నో వ‌చ్చాయి భ‌గ‌త్ సింగ్ పేరుతో. మేరా రంగ్ దే బ‌సంతీ చోలా అన్న‌ది ఆయ‌న‌కు ఇష్ట‌మైన పాట‌.

రామ్ ప్ర‌సాద్ బిస్మిల్ దీనిని రాశాడు. మేరా రంగ్ దే బ‌సంతీ చోలా అంటే నా లేత ప‌సుపు వ‌ర్ణ వేషం అని పంజాబ్ లో అర్థం.

సిక్కు మ‌తానికి చెందిన రెండు ప్ర‌ధాన వ‌ర్ణాల్లో ప‌సుపు ఒకటి. భ‌గ‌త్ సింగ్ ప్రాణ త్యాగంతో ద‌గ్గ‌ర‌గా ఉంది.

2008లో ఇండియా టుడే నిర్వ‌హించిన స‌ర్వేలో భార‌త దేశంలో అత్యంత ప్ర‌జా ద‌ర‌ణ పొందిన ప్ర‌భావంత‌మైన వీరుడిగా భ‌గ‌త్ సింగ్(Bhagat Singh) నిలిచాడు.

స‌ర్ఫ‌రోషీ కీ త‌మ‌న్నా – త్యాగానికై అభిలాష అని అర్థం. అమ్మా నా అంగ‌వ‌స్త్రానికి కాశయ రంగు అద్దు అని పాడాడు భ‌గ‌త్ సింగ్.

1968లో భ‌గ‌త్ సింగ్ పేరుతో త‌పాలా బిళ్ల విడుద‌ల చేసింది.

రాజీ ప‌డ‌ని మ‌న‌స్త‌త్వ‌మే ష‌హీద్ గా మార్చేసింది. ఈ సంద‌ర్భంగా ఆ పోరాట యోధుడు చెప్పిన మాట‌ల్ని మ‌రోసారి గుర్తుకు తెచ్చుకోవాలి.

జీవిత ల‌క్ష్యం అంటే..మ‌న‌స్సును నియంత్రించ‌డం కాదు. మోక్షం పొంద‌డం అంత‌క‌న్నా కాదు.

సామాజిక‌, రాజ‌కీయ‌, వ్య‌క్తిగ‌త జీవితంలో స‌మ ప్రాధాన్య‌త క‌ల్పించ‌డం ద్వారానే విశ్వ‌జ‌నీన స‌హోద‌ర‌త్వం సాధ్యం అవుతుంద‌ని ప్ర‌క‌టించాడు.

Also Read : సినీవాలిలో వివేక్ వెరీ స్పెష‌ల్

Leave A Reply

Your Email Id will not be published!