Bhagwant Mann Comment : మనసున్నోడు భగవంత్ మాన్
సామాన్యుడి నుంచి సీఎం దాకా
Bhagwant Mann Comment : ఒక్క సంతకం లక్షలాది మంది బతుకుల్లో వెలుగులు నింపుతుంది. అలాంటి అద్బుతమైన సన్నివేశానికి వేదికగా నిలిచింది పంజాబ్. వేలాది మంది కొన్నేళ్లుగా వెట్టి చాకిరి చేస్తూ వచ్చారు కాంట్రాక్టు పద్దతిన పాఠాలు చెప్పారు. వారందరికీ తీపి కబురు చెప్పారు సీఎం భగవంత్ మాన్. 12,750 మందికి పైగా పంతుళ్లను పర్మినెంట్ చేస్తున్నట్లు ప్రకటించారు. అంతే కాదు వారు ఊహించని రీతిలో ప్రతి ఒక్కరికీ తానే దగ్గరుండి పర్మినెంట్ ధ్రువీకరణ పత్రం అందజేశారు.
ఈ సంఖ్య తక్కువే కావచ్చు. కానీ మాన్ గురించి చెప్పుకోవాల్సింది చాలా ఉంది. వ్యక్తిగతమైన బలహీనతలు అతడిని వెనక్కి నెట్టివేసే ప్రయత్నం చేశాయి. కానీ వాటన్నింటినీ ఆయన తట్టుకుని నిలబడ్డారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ను కంట్రోల్ చేస్తానని ప్రకటించాడు. ఇందు కోసం చర్యలు తీసుకున్నాడు. అవినీతి రహిత పంజాబ్ రాష్ట్రాన్ని చేయడమే తన లక్ష్యమని ప్రకటించాడు. ఆ దిశగా అడుగులు వేశారు.
Bhagwant Mann Comment Viral
ప్రతిపక్షాలు అతడిని బఫూన్ గా, కమెడియన్ గా మాత్రమే చూశాయి. కానీ తాను ఏం చెబుతానో అది చేసి చూపిస్తానని స్పష్టం చేశాడు. రాష్ట్రంలో ఇక నుంచి ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ వ్యవస్థ అంటూ ఉండదన్నాడు. దశల వారీగా పర్మినెంట్ చేస్తానంటూ ప్రకటించాడు. ప్రస్తుతం ఖజానాపై భారం పడినా రాష్ట్ర ప్రగతిలో ప్రతి ఒక్కరి పాత్ర ఉందని , వారి సేవలకు తాను సలాం చేస్తున్నట్లు బహిరంగంగానే తెలిపాడు భగవంత్ మాన్. ఎవరైనా సరే ఎక్కడి నుంచైనా సరే రాష్ట్రంలో ఉన్న వారు తమకు ఇబ్బంది అనిపించినా లేదా ప్రభుత్వ శాఖల పరంగా ఎవరైనా లంచాలు డిమాండ్ చేసినా లేదా అక్రమాలకు పాల్పడినా వెంటనే తనకు ఫోన్ చేయాలని పిలుపునిచ్చిన ఏకైక సీఎం. అంతే కాదు వాట్సాప్ కు వివరాలు పంపించాలని, వీలైతే వీడియో కూడా తీసి పంపాలని కోరాడు.
ప్రస్తుతం భగవంత్ మాన్(Bhagwant Mann) వాట్సాప్ నెంబర్ కు వందల కొద్దీ మెస్సేజ్ లు వస్తుంటాయి. ఆయన అర్ధరాత్రి వరకు ఆఫీసులోనే ఉంటాడు. లేదంటే ఇంటికి వెళ్లినా అక్కడ కూడా వాటిని చూస్తాడు. నోట్స్ రాసుకుంటాడు. ఆపై చర్యలు తీసుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాడు. అది కరెక్టా కాదా అని ఇంటెలిజెన్స్, పోలీస్ వర్గాల నుంచి, తన ముఖ్య అనుచరుల నుంచి సమాచారం తెప్పించుకుంటాడు.
ఆపై వేటు వేస్తాడు భగవంత్ మాన్. అంతే కాదు తన మంత్రివర్గంలో లంచం డిమాండ్ చేసిన మంత్రిని తప్పించాడు. అతడిని పార్టీ నుంచి , ఎమ్మెల్యే పదవికి అనర్హుడంటూ స్పష్టం చేశాడు పంజాబ్ సీఎం(Bhagwant Mann). నిత్యం తాగకుండా ఉండలేడని, మద్యం మత్తులోనే స్వర్ణ దేవాలయంలోకి ఎంటర్ అయ్యాడని, సీఎంగా విదేశీ పర్యటనలో తాగి ఉన్న కారణంగా దించేశారంటూ బీజేపీ ప్రచారం చేసినా భగవంత్ మాన్ తట్టుకుని నిలబడ్డాడు.
నా తండ్రి టీచర్. నన్ను పంతులు కావాలని కోరుకున్నాడు. కానీ అందరి లాగా బతికితే మాన్ ఎలా అవుతాడంటూ ప్రశ్నించాడు. కాస్తంత వ్యంగ్యం, ఆపై సమాజంపై ఉన్న కోపం, ప్రజల పట్ల ఉన్న ప్రేమ అతడిని రాజకీయాల్లోకి వచ్చేలా చేసింది. ఎంపీగా, ఎమ్మెల్యేగా ప్రస్తుతం సీఎంగా కొలువు తీరేలా చేసింది. తన ఆఫీసులో ఎప్పటికీ గోడపై ఇద్దరి ఫోటోలు ఉంటాయి. ఒకరు అంబేద్కర్ మరొకరు షహీద్ భగత్ సింగ్. వ్యక్తిగత బలహీనతలు ఉన్నా తాను జనం కోసం బతకకుండా ఉండలేనంటాడు మాన్. అందుకే ఓ టీచర్ తల్లి సీఎంను అక్కున చేర్చుకుంది. ఆలింగనం చేసుకుని కన్నీటి పర్యంతమైంది. జీతే రహో భగవంత్ మాన్ జీ..ఆయన తన లక్ష్యం దిశగా సాగి పోవాలని కోరుకుందాం.
Also Read : BJP Focus : సార్వత్రిక ఎన్నికలపై బీజేపీ ఫోకస్