Bhanuka Rajapaksa : ఐపీఎల్ లో వరుస విజయాలతో దూసుకు పోతున్న గుజరాత్ టైటాన్స్ కు చుక్కలు చూపించింది పంజాబ్ కింగ్స్ . మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ ఏ కోశాన పోటీ ఇవ్వలేక పోయింది. పంజాబ్ కింగ్స్ బౌలర్ల దెబ్బకు కేవలం 8 వికెట్లు కోల్పోయి 142 రన్స్ చేసింది.
ఇక లక్ష్య సాధనలో క్రీజు లోకి వచ్చిన పంజాబ్ కింగ్స్ ఆడుతూ పాడుతూ విజయం సాధించింది. వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ దంచి కొడితే ఆఖరున లియామ్ లివింగ్ స్టోన్ సూపర్బ్ ఇన్నింగ్స్ ఆడాడు.
గుజరాత్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఇదే సమయంలో శిఖర్ ధావన్ తో పాటు శ్రీలంక స్టార్ క్రికెటర్ భానుక రాజపక్స్(Bhanuka Rajapaksa) సైతం అద్భుతంగా ఆడాడు.
కేవలం 28 బంతులు మాత్రమే ఎదుర్కొని 40 రన్స్ చేశాడు. ఇందులో 5 ఫోర్లు ఒక సిక్సర్ ఉంది. ఇదిలా ఉండగా రాజపక్స స్పెషాలిటీ ఏమిటంటే ఒక్కసారి క్రీజులో కుదురుకుంటే చాలు ఇక అతడిని ఆపడం కష్టం.
పూర్తి పేరు ప్రమోద్ భానుక బండార రాజపక్స(Bhanuka Rajapaksa). 24 అక్టోబర్ 1991లో పుట్టాడు శ్రీలంకలో . వయసు 30 ఏళ్లు. ఎడమ చేతి బ్యాటర్. ఇండియాతో 18 జూలై 2021లో వన్డేలో ఎంట్రీ ఇచ్చాడు.
5 అక్టోబర్ 2019లో పాకిస్తాన్ తో టీ20లో ఆడాడు. 2009 నుంచి 2010 వ వరకు బారిసల్ డివిజన్ తరపున ఆడాడు. సిహాళస్ స్పోర్ట్స్ క్లబ్ లో, 2020లో ఖుల్సా టైగర్స్ తరపున ఆడాడు.
ఈసారి 2022లో పంజాబ్ కింగ్స్ తరపున ఐపీఎల్ లో ప్రాతినిధ్యం వహిస్తున్నాడు భానుక రాజపక్స.
Also Read : జయవర్దనే డ్రీమ్ టీమ్ లో బుమ్రా