Bhanipriya : న‌ట‌న‌కు ప్ర‌తిరూపం భానుప్రియ‌

విల‌క్ష‌ణ న‌టి పుట్టిన రోజు

Bhanipriya : తెలుగు సినిమా రంగంలో భానుప్రియ విల‌క్ష‌ణ‌మైన న‌టిగా పేరొందారు. ఇవాళ ఈ అరుదైన న‌టి పుట్టిన రోజు. ఏపీలోని రాజ‌మండ్రి జిల్లా రంగంపేట స్వ‌స్థ‌లం. 15 జ‌న‌వ‌రి 1967లో పుట్టారు.

ప్ర‌స్తుతం ఆమె వ‌య‌సు 54 ఏళ్లు. సినీ న‌టిగా, న‌ర్త‌కిగా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు తెచ్చుకుంది.

1980 నుంచి 1993 మ‌ధ్య కాలంలో అనేక తెలుగు, త‌మిళ సినిమాల‌లో క‌థానాయిక‌గా న‌టించి మెప్పించింది.

1990 స‌మ‌యంలో కొన్ని బాలీవుడ్ చిత్రాల‌లో న‌టించింది. ఆమె బ్రాహ్మ‌ణ కుటుంబంలో పుట్టారు.

భానుప్రియ(Bhanipriya) సోద‌రి నిషాంతి కూడా శాంతి ప్రియ అనే పేరుతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైంది.

భానుప్రియ ప్ర‌స్తుతం అమెరికాలో ఉంటూ కూచిపూడి, భ‌ర‌త నాట్యంలో శిక్ష‌ణ ఇస్తోంది.

భానుప్రియ (Bhanipriya)దాదాపు 110 సినిమాల‌లో క‌థానాయిక‌గా న‌టించింది. తెలుగు సినీ అభిమానులు ఆమెను మ‌రో శ్రీ‌దేవిగా పిలుచు కోవ‌డం విశేషం.

భానుప్రియను మొద‌ట‌గా తెలుగు సినీ రంగానికి ప‌రిచ‌యం చేసింది మాత్రం క్రియేటివ్ డైరెక్ట‌ర్ వంశీ. ఆయ‌న తీసిన సితార‌తో తెరంగేట్రం చేసింది భానుప్రియ.

ఆలాప‌న సినిమా ఆమెను అద్భుత‌మైన న‌టిగా మ‌రోసారి తెర‌కెక్కించాడు వంశీ. ఆమెలోని న‌ట‌న ప్ర‌తి ఒక్క‌రినీ ఆక‌ట్టుకునేలా చేసింది.

ఆ త‌ర్వాత మ‌రో దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు కాశీనాథుని విశ్వ‌నాథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన స్వ‌ర్ణ క‌మ‌లం తో క‌ళాకారిణిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఆ త‌ర్వాత అనేక క‌మర్షియ‌ల్ సినిమాల‌లో న‌టించింది. స‌న్ నెట్ వ‌ర్క్ చాన‌ల్ లో ప్ర‌సార‌మైన శ‌క్తి అనే టెలీ సీరీయ‌ల్ లో న‌టించింది. బ‌హు భాషా న‌టిగా మెప్పించింది.

తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో న‌టించింది. భానుప్రియ‌, వంశీల క‌ల‌యికలో వచ్చిన మూవీస్ విజ‌య‌వంతంగా న‌డిచాయి. న‌టిగా, న‌ర్త‌కిగా త‌న‌దైన ప్ర‌త్యేక బాణీ ప‌లికించిన భానుప్రియ అగ్ర హీరోలంద‌రి స‌ర‌స‌న న‌టించింది.

భానుప్రియ‌తో క‌లిసి న‌టించ‌డం తన‌కు ఓ ఛాలెంజ్ లాంటిదని అన్నాడు చిరంజీవి. బాల‌కృష్ణ‌, వెంక‌టేశ్ తో న‌టించిన మూవీస్ హిట్ గా నిలిచాయి. హిందీలో స‌క్సెస్ కాలేక పోయారు.

భానుప్రియ మ‌రిన్ని పుట్టిన రోజులు జ‌రుపుకోవాల‌ని తెలుగుఇజం కోరుకుంటోంది.

Also Read : హ‌క్కుల యోధుడు బాల‌ల పాలిట దేవుడు

Leave A Reply

Your Email Id will not be published!