Keegan Petersen : సౌతాఫ్రికా దిగ్గజ ఆటగాడు కీగన్ పీటర్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత బౌలింగ్ అటాకింగ్ బాగుందంటూ కితాబు ఇచ్చాడు. తాను పరుగులు చేసేందుకు ఇబ్బంది పడ్డానని పేర్కొన్నాడు.
ఇదిలా ఉండగా భారత, సఫారీ జట్ల మధ్య మూడు టెస్టుల సీరీస్ లో సౌతాఫ్రికా 2-1 తేడాతో సీరీస్ గెలిచింది. అయితే ఈ మొత్తం సీరీస్ లో రన్స్ పరంగా కీగన్ పీటర్సన్ టాప్ లో నిలిచాడు.
భారత జట్టు 113 పరుగుల తేడాతో సెంచూరియన్ వేదికగా జరిగిన ఫస్ట్ టెస్టులో ఘన విజయం సాధిస్తే జోహెన్నెస్ బర్గ్ లో జరిగిన రెండో టెస్టులో కెప్టెన్ ఎల్గర్ దెబ్బకు ఆ జట్టు గెలుపొందింది.
ఇక కేప్ టౌన్ వేదికగా జరిగిన మూడో టెస్టులో ఊహించని రీతిలో కీగన్ పీటర్సన్ అడ్డుగోడలా నిలబడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. రెండు, మూడు టెస్టుల్లో సౌతాఫ్రికా 7 వికెట్ల తేడాతో ఇండియాపై గ్రాండ్ విక్టరీ సాధించడం విశేషం.
సీరీస్ ముగిశాక కీగన్ పీటర్సన్ (Keegan Petersen)మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఏది ఏమైనా భారత బౌలర్లు చాలా కష్ట పడ్డారని కానీ ఫలితం తమ వైపు వచ్చిందన్నాడు.
ప్రత్యేకించి భారత బౌలింగ్ అటాక్ తనకు పెను సవాల్ గా మారిందన్న విషయాన్ని ఒప్పుకున్నాడు. తన అద్భుతమైన బ్యాటింగ్ తో ఈ స్టైలిష్ రైట్ హ్యాండర్ బ్యాటర్ 46.00 సగటుతో ఏకంగా 276 పరుగులు చేసి మొత్తం సీరీస్ లో నెంబర్ వన్ గా నిలిచాడు.
ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అయినా లేదా ఏ విధమైనా క్రికెట్ లో అయినా ఇది తన కెరీర్ లో ఎదుర్కొన్న బిగ్ బౌలింగ్ అని పేర్కొన్నాడు.
Also Read : టెస్టు కెప్టెన్సీకి పంత్ బెటర్