Bhatti Vikramarka Mallu : అలసత్వం వహిస్తే సహించం – భట్టి
కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో డిప్యూటీ సీఎం
Bhatti Vikramarka Mallu : హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం సచివాలయంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కొత్తగా కొలువు తీరిన ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు సాధ్యా సాధ్యాలపై సమీక్ష చేపట్టారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు.
Bhatti Vikramarka Mallu Comment
అధికారులు ఎవరైనా సరే బాధ్యతతో మెలగాలని, తమకు కేటాయించిన లక్ష్యాలను చేరుకునేందుకు ప్రయత్నం చేయాలని లేకపోతే ఊరుకునే ప్రసక్తి లేదన్నారు. ప్రత్యేకించి ఎవరికి వారు బాధ్యతతో మెలిగితే ఇబ్బందులు అంటూ ఉండవని పేర్కొన్నారు మల్లు భట్టి విక్రమార్క(Bhatti Vikramarka Mallu). దేనినైనా భరిస్తాం కానీ అలసత్వాన్ని భరించే ప్రసక్తి లేదన్నారు. ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు , అపోహలు పెట్టు కోవద్దని స్పష్టం చేశారు.
ప్రతి లబ్దిదారుడికి ప్రభుత్వ పథకాలను అందించాల్సిన బాధ్యత అధికారులదేనని పేర్కొన్నారు. పాత సర్కార్ కు సంబంధించి అమలు చేసిన పద్దతులను అమలు చేస్తామంటే కుదరని తేల్చి చెప్పారు మల్లు భట్టి విక్రమార్క. ఇదిలా ఉండగా తాజాగా డిప్యూటీ సీఎం చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
Also Read : CM Revanth Reddy : పని చేయండి లేదంటే తప్పుకోండి