CM Revanth Reddy : ప‌ని చేయండి లేదంటే త‌ప్పుకోండి

క‌లెక్ట‌ర్లు..ఎస్పీల‌కు సీఎం వార్నింగ్

CM Revanth Reddy : హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి సీరియ‌స్ అయ్యారు. ఇవాళ స‌చివాల‌యంలో జ‌రిగిన జిల్లా క‌లెక్ట‌ర్లు, ఎస్పీల‌తో స‌మీక్ష చేప‌ట్టారు. ఇందులో భాగంగా తాము ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన ఆరు గ్యారెంటీల‌ను స‌క్ర‌మంగా అమ‌లు చేసేందుకు ప్ర‌తి ఒక్క‌రు బాధ్య‌త‌తో ప‌ని చేయాల‌ని స్ప‌ష్టం చేశారు. రోజుకు 18 గంట‌ల పాటు ప‌ని చేయాల‌ని సూచించారు.

CM Revanth Reddy Comment

ఒక‌వేళ ప‌ని చేయ‌డం కుద‌రదు అని అనుకుంటే మీ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకోవాల‌ని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మ‌రింత భారం అనిపిస్తే సీఎస్, డీజీపీల‌కు చెప్పి వెళ్లి పోవ‌చ్చంటూ స్ప‌ష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy).

బాధ్య‌త‌లు తీసుకుంటే పూర్తి స్థాయిలో ప‌ని చేయాల‌ని, మ‌రింత మెరుగైన రీతిలో ప్ర‌జ‌ల‌కు సేవ‌లు అందించాల‌ని పేర్కొన్నారు. దేశంలోనే అత్యున్న‌త స‌ర్వీసు ఏదైనా ఉందంటే అది యూపీఎస్సీ అని దాని ద్వారా ఎంపికైన మీరంతా మ‌రంత బాధ్యాత‌యుత‌మైన రీతిలో వ్య‌వ‌హ‌రించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి.

ప్ర‌జ‌లు త‌మ మీద ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నార‌ని, వారికి మ‌రింత ద‌గ్గ‌ర‌య్యేలా పాల‌న సాగించాల‌ని స్ప‌ష్టం చేశారు. అధికారం ఉంది క‌దా అని నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తే చూస్తూ ఊరుకునేది లేద‌ని మండిప‌డ్డారు సీఎం.

Also Read : Chiranjeevi : స‌లార్ స‌క్సెస్ మెగాస్టార్ కంగ్రాట్స్

Leave A Reply

Your Email Id will not be published!