Chiranjeevi : స‌లార్ స‌క్సెస్ మెగాస్టార్ కంగ్రాట్స్

బాక్సులు బ‌ద్ద‌లు క‌లెక్ష‌న్స్ సూప‌ర్

Chiranjeevi : ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో డార్లింగ్ ప్ర‌భాస్, అందాల బొమ్మ శ్రుతి హాస‌న్ క‌లిసి న‌టించిన స‌లార్ దుమ్ము రేపుతోంది. తొలి షో నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకు పోతోంది. దేశ వ్యాప్తంగా విడుద‌లైన ప్ర‌తి చోటా క‌లెక్ష‌న్ల సునామీ సృష్టిస్తోంది.

Chiranjeevi Congratulates to Salaar Team

ఇదిలా ఉండ‌గా వ‌రుస‌గా ప్ర‌భాస్ తీసిన సినిమాలు ప్లాపులు వెంటాడాయి. గ‌తంలో న‌టించిన సాహో, రాధే శ్యామ్, ఆది పురుష్ ఆశించిన మేర స‌క్సెస్ కాలేదు. దీంతో ప్ర‌శాంత్ నీల్ తీసిన స‌లార్ పై కూడా అంత‌గా అంచ‌నాలు పెట్టుకోలేదు.

అయితే ముందు నుంచీ త‌న‌కు సినిమా స‌క్సెస్ అవుతుంద‌ని న‌మ్మ‌కం ఉంద‌ని స్ప‌ష్టం చేశాడు డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్. త‌ను అనుకున్న దానికంటే బిగ్ హిట్ గా పేరు తెచ్చుకుంది. గ‌తంలో ఉన్న రికార్డుల‌ను అన్నింటిని తిర‌గ రాసింది స‌లార్.

ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఎక్క‌డ చూసినా సంబురాల‌లో మునిగి పోయారు. సినీ రంగానికి చెందిన ప‌లువ‌రు సినీ ద‌ర్శ‌కులు, న‌టీ న‌టులు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. తాజాగా అందులో చేరి పోయారు ప్ర‌ముఖ న‌టుడు మెగా స్టార్ చిరంజీవి(Chiranjeevi). ప్ర‌భాస్ కెరీర్ లో అద్భుత‌మైన సినిమాగా మిగిలి పోతుంద‌న‌డంలో సందేహం లేద‌న్నాడు మెగాస్టార్.

Also Read : MLA Lasya Nanditha : ఎమ్మెల్యే లాస్య‌కు త‌ప్పిన ప్ర‌మాదం

Leave A Reply

Your Email Id will not be published!