మై హోమ్ రామేశ్వర్ రావు చీకటి సామ్రాజ్యంపై చర్యలేవీ..?
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో కోట్ల రూపాయల దోపిడి
హైదరాబాద్ : ఒక సాధారణ హోమియోపతి వైద్యుడిగా ప్రస్థానం మొదలు పెట్టి నేడు హైదరాబాద్‌లో వేల కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన దిగ్గజంగా నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన మై హోం అధినేత జూపల్లి రామేశ్వర్ రావు మరోసారి సంచలనంగా మారారు. ఆయన భూ దోపిడీ గురించి శాసన సభ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఆధారాలతో సహా వెల్లడించారు. ఇది చర్చకు దారితీసేలా చేసింది. తను ప్రస్తుతం మీడియా, రియల్ ఎస్టేట్, ఆధ్యాత్మిక రంగాలలో కీలకమైన వ్యక్తిగా కొనసాగుతున్నారు. ఇంతకు ఒక సామాన్యమైన వైద్యుడు ఇలా వేల కోట్ల సామ్రాజ్యానికి ఎలా ఎదిగారన్నది చాలా మందికి అంతు చిక్కని ప్రశ్నగా మిగిలి పోయింది. ఆయన మాటలు నీతివంతంగా (శ్రీరంగ నీతులు) ఉంటాయి. చేతలు మాత్రం పాప భూయిష్టమైనవని రామేశ్వర్ రావుపై తీవ్ర విమర్శలు ఉన్నాయి.
హైదరాబాద్‌లో ఎటు చూసినా ‘మై హోమ్ గ్రూప్’ భవనాలే కనిపిస్తాయి. ఆ భూములను ఆయన ఎలా దక్కించుకున్నారు? ప్రభుత్వం వాటిని కేటాయించిందా? ఇలాంటి ప్రశ్నలు ప్రజల్లో ఉన్నాయి. ప్రతి భవనంలోనూ ప్రభుత్వ పెద్దల బినామీ వాటాలు ఉన్నాయన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
బయట పూజా కార్యక్రమాలు, ఆధ్యాత్మికతతో కనిపించే రామేశ్వర్ రావు మీడియా రంగాన్ని తన గుప్పిట్లో ఉంచుకుని ఇతరులను బెదిరిస్తున్నారనే ప్రచారం కూడా ఉంది. హైదరాబాద్‌లోని భవనాల వెనుక ఉన్న రహస్యాలు బయట పడితే, బినామీల బండారం కూడా బయట పడుతుందని అంటారు .హైదరాబాద్‌లోని ప్రముఖ బిల్డర్లందరికీ కేటీఆర్, హరీష్ రావులే బినామీలుగా ఉన్నారనే ప్రచారం ప్రజల్లో ఉంది.
కానీ ప్రభుత్వం మాత్రం కేవలం 10 లేదా 20 ఎకరాల పంచాయతీ భూముల వ్యవహారాలకే పరిమితం చేస్తోంది. హైదరాబాద్‌లోని వందలాది బహుళ అంతస్తుల భవనాల్లో కేటీఆర్ వాటాలకు సంబంధించిన లెక్కలను రేవంత్ రెడ్డి ఎప్పుడు బయట పెడతారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. RRR (రీజినల్ రింగ్ రోడ్) పరిసరాల్లో బిల్డర్ల చేతిలో ఉన్న వేలాది ఎకరాల భూముల లెక్కలు ఎప్పుడు వెలుగులోకి వస్తాయి? ‘వోర్టెక్స్’ (Vortex) వంటి సంస్థల వెనుక ఎవరున్నారో అందరికీ తెలుసనే చర్చ జరుగుతోంది. నిజామాబాద్‌లోని నడిపేట్ వద్ద గోదావరి తీరంలో ఉన్న 100 ఎకరాల గురించి కవిత ఎందుకు మర్చి పోయారని ఆమెను ప్రశ్నిస్తున్నారు.