MLA Lasya Nanditha : ఎమ్మెల్యే లాస్య‌కు త‌ప్పిన ప్ర‌మాదం

సుర‌క్షితంగా బ‌య‌ట ప‌డ్డ నందిత

MLA Lasya Nanditha : హైద‌రాబాద్ – ఆధునిక సౌక‌ర్యాలు మ‌నుషుల్ని మ‌ర మ‌నుషులుగా చేస్తున్నాయి. తాము త‌యారు చేసిన వాటిలోనే తాము ఇరుక్కునే ప‌రిస్థితికి వ‌చ్చారు. ఇటీవ‌ల లిఫ్టు ప్ర‌మాదాలు కొన‌సాగుతూనే ఉన్నాయి. తాజాగా శాస‌న స‌భ్యురాలు లిఫ్టులో ఇరుక్కున్న ఘ‌ట‌న ఆదివారం చోటు చేసుకుంది హైద‌రాబాద్ న‌గ‌రంలో.

MLA Lasya Nanditha Safe

చివ‌ర‌కు సిబ్బంది చాక చ‌క్యంతో ప్ర‌య‌త్నం చేయ‌డంతో బ‌తికి బ‌య‌ట ప‌డ్డారు స‌ద‌రు ఎమ్మెల్యే. ఆమె ఎవ‌రో కాదు లాస్య నందిత‌. బోయిన‌ప‌ల్లిలో ఎమ్మెల్యేను ముఖ్య అతిథిగా ఓ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యేందుకు వెళ్లారు.

ఓ ప్రైవేట్ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు. భ‌వ‌నంలోని పై అంత‌స్తులో ఈ కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేశారు నిర్వాహ‌కులు. దీంతో పై అంత‌స్తు లోప‌లికి వెళ్లేందుకు ప్ర‌య‌త్నం చేశారు. ఈ మేర‌కు ఎమ్మెల్యే లాస్య నందిత(MLA Lasya Nanditha) లిఫ్టు ఎక్కారు .

దీంతో ఓవ‌ర్ లోడ్ తో ఒక్క‌సారిగా లిఫ్టు గ్రౌండ్ ఫ్లోర్ లోకి కూరుకు పోయింది. దీంతో ఒక్క‌సారిగా ఏం జ‌రుగుతుందో తెలియ‌క కాసేపు ఇబ్బంది ప‌డ్డారు లాస్య నందిత‌. ఒక్క‌సారిగా అంతా షాక్ కు గుర‌య్యారు.

ఆమె బ‌య‌టకు వ‌చ్చేందుకు నానా తంటాలు ప‌డ్డారు సిబ్బంది. చివ‌ర‌కు గున‌పాల‌తో బ‌ద్ద‌లు కొట్టారు. చివ‌ర‌కు బ‌య‌ట‌కు తొల‌గించారు. దీంతో ఒక్క‌సారిగా ఊపిరి పీల్చుకున్నారు ఎమ్మెల్యే లాస్య నందిత‌.

Also Read : KTR Slams : అంకెల గార‌డీపై బీఆర్ఎస్ ఫైర్

Leave A Reply

Your Email Id will not be published!