Bhatti Vikramarka: సుంకిశాల నిర్మాణం బీఆర్‌ఎస్ హయంలోనే నిర్మాణం జరిగింది
సుంకిశాల నిర్మాణం బీఆర్‌ఎస్ హయంలోనే నిర్మాణం జరిగింది
Bhatti Vikramarka: హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని ఎస్పీడీసీఎల్ అధికారులకు అదేశించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ప్రస్తుతం వర్షాకాలం సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని అధికారులను అప్రమత్తం చేశామని తెలిపారు. ఆయన గురువారం మింట్ కాంపౌండ్‌లో మాట్లాడారు.
Bhatti Vikramarka Comment
అంతర్జాతీయ పెట్టుబడులను దృష్టిలో పెట్టుకొని విద్యుత్ సరఫరాపై దిశానిర్దేశం చేశాము. ఎస్పీడీసీఎల్‌లో అంతర్గత బదిలీలు, ప్రమోషన్లపై కూడా ఆదేశాలు జారి చేశాం. విద్యుత్ సరఫరాకు ఏదైనా ఇబ్బంది అయితే 1912 టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫిర్యాదు చేయొచ్చు. ప్రజల కోసమే నిరంతరం ఎస్పీడీసీఎల్ పనిచేస్తోంది అని మర్చిపోవద్దు’’ అని అన్నారు.
సుంకిశాలపై వార్తల్లో తప్పుడు ప్రచారం జరుగుతోందని భట్టి విక్రమార్క్(Bhatti Vikramarka) అన్నారు. ‘మేడిగడ్డ గోదావరి నదిపై మాత్రమే కాదు.. కృష్ణానదిని కూడా గత ప్రభుత్వం వదిలిపెట్టలేదు. సుంకిశాల నిర్మాణం బీఆర్‌ఎస్ హయంలోనే నిర్మాణం జరిగింది. డిజైన్ లోపం వల్ల సుంకిశాల కూలింది. దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వంపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. సుంకిశాల కట్టింది మేము కాదు.. గత ప్రభుత్వం కట్టిందే. గోదావరి మెడిగడ్డతో పాటు సుంకుశాల పాపం బీఆర్‌ఎస్ ప్రభుత్వానిదే. 2021లో మొదలు 2023 జులైలో సుంకిశాలను గత ప్రభుత్వం ప్రారంభించింది. గత ప్రభుత్వ పాపాలను మాపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. పాపాలను భరించలేక ఇప్పటికే ప్రజలు గత ప్రభుత్వనికి బుద్ధి చెప్పారు’ అని అన్నారు.
Also Read : CM Kejriwal: జ్యుడీషియల్ కస్టడీ మరోసారి పొడిగింపు