Bhatti Vikramarka : కోలుకుంటారు తిరిగి వస్తారు
కేసీఆర్ ఆరోగ్యంపై భట్టి కామెంట్
Bhatti Vikramarka : హైదరాబాద్ – రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ సీఎం కేసీఆర్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఆయన ఆరోగ్యం గురించి వాకబు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ బాగానే ఉన్నారని, త్వరలోనే కోలుకుంటారని, అసెంబ్లీకి వస్తారని స్పష్టం చేశారు.
Bhatti Vikramarka Comment
ఇదిలా ఉండగా కేసీఆర్ ను పరామర్శించేందుకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు క్యూ కట్టారు. సినీ, వ్యాపార, రాజకీయ రంగాలకు చెందిన వారు పరామర్శించారు. ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీశారు.
ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో జారి పడడంతో కేసీఆర్ తుంటి విరిగింది. పడి పోయిన ఆయనను హుటా హుటిన హైదరాబాద్ లోని సోమాజిగూడ యశోద ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షలు చేపట్టారు.
తుంటి విరిగిందని శస్త్ర చికిత్స చేయాలని స్పష్టం చేశారు. అయితే ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. దీంతో ఊపిరి పీల్చుకున్నారు కల్వకుంట్ల కుటుంబం. పరీక్షలు చేసిన అనంతరం కేసీఆర్ కు ఆపరేషన్ చేయడం, అది పూర్తిగా సక్సెస్ కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Also Read : Praja Darbar : జనం క్యూ కట్టారు పోటెత్తారు