Camille Vasquez : జానీ డెప్ లాయర్ కు బిగ్ ప్రమోషన్
వరల్డ్ వైడ్ స్టార్ గా మారిన కెమిల్లె వాస్క్వేజ్
Camille Vasquez : ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠతో ఎదురు చూసిన ప్రముఖ హాలీవుడ్ నటుడు జానీ డెప్ పరువు నష్టం కేసులు తుది తీర్పు వెలువడింది. ఈ మేరకు వర్జీనియా కోర్టులో ఈ కేసు నడించింది.
ఏడుగురు సభ్యులతో కూడిన జ్యూరీ అసాధారణ తీర్పు వెలువరించింది. జానీ డెప్ పై పరువు నష్టం దావా వేసిన మాజీ భార్య అంబర్ హియర్డ్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది.
ఈ మేరకు డెప్ కు $15 మిలియన్ల డాలర్ల నష్ట పరిహారం చెల్లించాలంటూ తీర్పు చెప్పింది. ఇదిలా ఉండగా జానీ డెప్ తరపున యంగ్ , డైనమిక్ లాయర్ గా వాదించారు కెమిల్లె వాస్క్వేజ్(Camille Vasquez).
ఆమె ఒక్కసారిగా ప్రపంచ వ్యాప్తంగా మోస్ట్ పాపులర్ సెలెబ్రిటీగా మారి పోయారు. ఈ తరుణంలో కెమిల్లె వాదన పటిమ, ప్రతిభా పాటవాలు, వాదించిన విధానం, సమాచార సేకరణ, ప్రత్యర్థి లాయర్ కు ముచ్చెమటలు పట్టించిన విధానం యావత్ ప్రపంచం చూసి విస్తు పోయింది.
జానీ డెప్ కేసును గెలిపించిన ఘనత కెమిల్లె వాస్క్వేజ్(Camille Vasquez) కే దక్కుతుంది. ప్రధానంగా లాయర్ అంబర్ హియర్డ్ ను క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నప్పుడు ఆమె న్యాయ నైపుణ్యం ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేలా చేసింది.
ఇంటర్నెట్ లో సంచలనంగా మారింది. జానీ డెప్ కేసు గెలవడంలో కీలక పాత్ర పోషించిన కెమిల్లె కు భారీ పదోన్నతి లభించింది. ఆమె పని చేస్తున్న న్యాయ సంస్థ బ్రౌన్ రుడ్నిక్ లో పదోన్నతి లభించింది.
ఆరు వారాల పాటు కొనసాగింది ఈ కేసు. ఆమెను , ప్రతిభను చూసి గర్వపడుతున్నామని సదరు సంస్థ ట్వీట్ చేసింది. దీంతో కెమిల్లెకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
Also Read : ఇంకెంత కాలం కాల్పుల మోత