Shakira : గ్లోబల్ సింగర్ షకీరాకు బిగ్ షాక్
పన్ను ఎగవేతపై 8 ఏళ్ల జైలు శిక్ష
Shakira : ప్రపంచంలోనే టాప్ సింగర్ గా పేరుంది షకీరాకు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఒక్కోసారి అనుకోకుండా ఇబ్బందులు ఏర్పడతాయి. తెచ్చి పెట్టుకున్నవేవీ ఒక్కోసారి అక్కరకు రావు.
తాజాగా తన పాటలతో ఉర్రూత లూగిస్తూ కోట్లాది అభిమానుల గుండెల్ని తన గాత్రంతో మెస్మరైజ్ చేసే షకీరాకు(Shakira) కోలుకోలేని షాక్ తగిలింది.
స్పెయిన్ లో పన్ను కట్టకుండా మోసం చేసినందుకు గాను ఏకంగా ఈ గ్లోబల్ సింగర్ షకీరాకు ఏకంగా 8 ఏళ్ల జైలు శిక్ష పడింది.
2012 నుండి 2014 మధ్య కాలంలో అంటే రెండేళ్ల కాలంలో సంపాదించిన ఆదాయంపై 14.5 మిలియన్ల యూరోలు ($14.7 మిలియన్లు ) కట్టకుండా స్పానిష్ పన్ను కార్యాలయాన్ని మోసం చేసిందని ప్రాసిక్యూటర్లు ఆరోపించారు.
పన్ను మోసం ఆరోపణలపై ఒక అభ్యర్థనను తిరస్కరించడంపై ఆమెపై ఎనిమిదేళ్లకు పైగా జైలు శిక్ష విధించాలని బార్సిలోనా లోని న్యాయవాదులు తెలిపారు.
కోర్టు ఇప్పుడు విచారణను నిర్వహించడం, తేదీని నిర్ణయించడం అవసరమని అభిప్రాయపడ్డారు. అప్పీల్ ఒప్పందాన్ని షకీరా తిరస్కరించిందని పేర్కొన్నారు.
బార్సిలోనా డిఫెండర్ గెరార్డ్ పిక్ తో ఆమె సంబంధం పబ్లిక్ గా మారినప్పుడు షకీరా 2011లో స్పెయిన్ కు వెళ్లిందని, 2015 వరకు బహామాస్ లో అధికారిక పన్ను రెసిడెన్సీని కొనసాగించిందని ప్రాసిక్యూటర్లు చెప్పారు.
ది వాయిస్ షోలో సంపాదించిన డబ్బును క్లెయిమ్ చేయాలని పట్టుపట్టారు. ఇదిలా ఉండగా షకీరా రక్షణ బృందం 2015లో మాత్రమే పూర్తి సమయం స్పెయిన్ కి వెళ్లిందని తెలిపింది.
అన్ని పన్నులను కట్టేసిందని స్పష్టం చేసింది. 17.2 మిలియన్ యూరోలు చెల్లించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని షకీరా పేర్కొంది.
Also Read : లోకల్ ట్రైన్ లో అనన్య..దేవరకొండ