CPI Narayana : బిగ్ బాస్ అదో అనైతిక షో – నారాయ‌ణ

మ‌రోసారి నిప్పులు చెరిగిన సీపీఐ నేత

CPI Narayana :  దేశ వ్యాప్తంగా బిగ్ బాస్ కు విప‌రీత‌మైన జనాద‌ర‌ణ ఉంది. చాలా భాష‌ల్లో వేర్వేరు కాన్సెప్ట్ తో కొన‌సాగుతూ వ‌స్తోంది. హిందీ, త‌మిళ్, తెలుగులో కంటిన్యూ అవుతోంది.

దీనికి విప‌రీతమైన రేటింగ్ వ‌స్తోంది. దీంతో ఇలాంటి షోస్ కు ఎక్కువ‌గా ప్ర‌యారిటీ ఇస్తున్నాయి ఛానెల్స్. స్టార్ మా దీనిని ప్ర‌జెంట్ చేస్తోంది.

గ‌త కొంత కాలంగా శ్రుతి మించి పోతున్న కంటెంట్, పాల్గొంటున్న వారి వెకిలి చేష్ట‌లు, వెట‌కారాలు, కౌగిలింత‌లు, పాట‌లు, స‌య్యాట‌లు..ఇలా చెప్పుకుంటూ పోతే అదో ర‌కంగా చెప్పాలంటే ఇంటిల్లిపాది చూసేందుకు అర్హ‌త కాని ప్రోగ్రాం.

కానీ ఇప్పుడు దీనికి జ‌నం అడిక్ట్ గా మారి పోయారు. ఇందులో పార్టిసిపేట్ చేస్తున్న వారంద‌రికీ ఫుల్ పాపులారిటీ, క్రేజ్ కూడా ద‌క్కుతోంది. దీంతో ఈ రియాల్టీ షో ద్వారా మోస్ట్ పాపుల‌ర్ గా మారి చేతినిండా సంపాదిస్తున్నారు.

దీనికి ప‌లువురు హోస్ట్ చేసినా ఎవ‌రూ స‌క్సెస్ కాలేక పోయారు. కానీ ఆడపిల్ల‌ల రాకుమారుడిగా పేరొందిన అక్కినేని నాగార్జున రావ‌డంతో దీనికి మ‌రింత క‌ళ వ‌చ్చింది.

ఈ బిగ్ బాస్ ప్రోగ్రాం వ‌ల్ల స‌మాజానికి ఒరిగేది అంటూ ఏమీ ఉండ‌ద‌ని గ‌తంలో నిప్పులు చెరిగారు సీపీఐ నాయ‌కుడు నారాయ‌ణ‌(CPI Narayana). తాజాగా మ‌రోసారి బిగ్ బాస్ షోపై స్పందించారు.

అదంతా బూతు బాగోత‌మ‌ని, అందులో ఏముంద‌ని చెప్ప‌డానికి అంటూ మండిప‌డ్డారు. కాసుల కోసం అర్రులు చాచే వారు ఉన్నంత కాలం ఇలాంటి షోలు ఉంటూనే ఉంటాయ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు నారాయ‌ణ‌.

Also Read : రాక్ స్టార్ తో పెళ్లి అబ‌ద్దం – పూజిత

Leave A Reply

Your Email Id will not be published!