Tejasswi Prakash : బిగ్ బాస్ విన్న‌ర్ తేజ‌స్వి ప్ర‌కాష్

ర‌న్న‌ర్ అప్ గా ప్ర‌తీక్ సెహ‌జ్ పాల్

Tejasswi Prakash  : దేశ వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ రేపిన హిందీ బిగ్ బాస్ రియాల్టీ షో 15వ సీజ‌న్ విజేత‌గా అంద‌రూ ఊహించిన‌ట్లుగానే టీవీ (బుల్లితెర‌) న‌టిగా పేరొందిన తేజ‌స్వి ప్ర‌కాష్ నిలిచారు.

ట్రోఫీతో పాటు రూ. 40 ల‌క్ష‌ల క్యాష్ ప్రైజ్ అందుకున్నారు. దీంతో తీవ్ర భావోద్వేగానికి లోన‌య్యారు తేజ‌స్వి ప్ర‌కాష్(Tejasswi Prakash ). టీవీ స్టార్ గా ఇప్ప‌టికే తేజ‌స్వి ప్రాచుర్యం పొందారు.

వేలాది మంది అభిమానుల‌ను సంపాదించుకున్నారు. మొద‌టి నుంచీ బిగ్ బాస్ రియాల్టీ షోకు టైటిల్ ఫేవ‌రేట్ గా ఎంట‌రైంది. చివ‌రి దాకా ఫైన‌ల్ రేసుకు చేరుకున్న సెహ‌జ్ పాల్ ను ఓడించి విన్న‌ర్ గా నిలిచింది తేజ‌స్వి ప్ర‌కాష్.

విజేత‌తో పాటు ర‌న్న‌ర్ అప్ ను బాలీవుడ్ సూప‌ర్ స్టార్ స‌ల్మాన్ ఖాన్ ఆహుతులు, అశేష వీక్ష‌కుల ఉత్కంఠ‌కు తెర దించుతూ ప్ర‌క‌టించారు. క‌ర‌ణ్ కుంద్రా మూడో స్థానంతో స‌రి పెట్టుకున్నాడు.

న‌టి ష‌మితా శెట్టి నాలుగో స్థానంలో నిలిచారు. కొరియోగ్రాఫ‌ర్ నిశాంత్ భ‌ట్ ఫైన‌ల్ రేసు నుంచి వైదొలిగాడు. ఇందుకు గాను రూ. 10 ల‌క్ష‌లు తీసుకుని ఐద‌వ స్థానంతో స‌రి పెట్టుకున్నాడు.

ఇక విజేత‌గా నిలిచిన తేజ‌స్వి ప్ర‌కాష్ టీవీ స్టార్ గా పాపులారిటీ కావ‌డంతో పోటీత‌త్వాన్ని ప్ర‌ద‌ర్శించింది. షో సంద‌ర్భంగా తేజ‌స్వి ప్ర‌కాశ్(Tejasswi Prakash )కుంద్రాతో ప్రేమ‌లో ప‌డిన‌ట్లు ప్ర‌చారం కూడా జ‌రిగింది.

ఈ జంట మోస్ట్ పాపుల‌ర్ గా నిలిచింది. ఇక గ‌త ఏడాది బిగ్ బాస్ ఓటీటీ ఫైన‌లిస్టుల‌లో ఒక‌రిగా నిలిచిన సెహ‌జ్ పాల్ కూడా షో మొత్తంగా ప్ర‌జాద‌ర‌ణ పొందారు.

Also Read : జూనియ‌ర్ తో జాన్వీ క‌పూర్ మూవీ ?

Leave A Reply

Your Email Id will not be published!