S Jai Shankar : ఉగ్ర‌వాద ప‌రిశ్ర‌మ‌కు భుట్టో ప్ర‌తినిధి

ఎస్ జై శంక‌ర్ షాకింగ్ కామెంట్స్

S Jai Shankar : దేశ విదేశాంగ శాఖ మంత్రి సుబ్ర‌మ‌ణ్యం జై శంక‌ర్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఇండియాలోని గోవాలో జ‌రుగుతున్న జి20, ఎస్ సిఓ విదేశాంగ శాఖ మంత్రుల స‌మావేశంలో పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి బిలావ‌ల్ భుట్టో జ‌ర్దారి, చైనా విదేశాంగ శాఖ మంత్రి క్విన్ గ్యాంగ్ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్బంగా జ‌రిగిన స‌ద‌స్సులో ఎస్ జై శంక‌ర్(S Jai Shankar) మాట్లాడారు. ఆయ‌న ప్ర‌ధానంగా సీమాంత‌ర ఉగ్ర‌వాదం గురించి ప్ర‌స్తావించారు. ఇది ఒక్క ఆసియా ఖండానికే కాదు యావ‌త్ ప్ర‌పంచానికి పెను ముప్పుగా మారింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ప్ర‌మాదక‌రంగా త‌యారైన ఉగ్ర‌వాద ప‌రిశ్ర‌మ‌ను ప్రోత్స‌హించ‌డ‌మే కాకుండా ప్ర‌తినిధిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ బిలావ‌ల్ భుట్టో జ‌ర్దారీని ఉద్దేశించి షాకింగ్ కామెంట్స్ చేశారు ఎస్ . జైశంక‌ర్. ఉగ్ర‌వాద బాధితులు దాని నేర‌స్థుల‌తో క‌లిసి ఉగ్ర‌వాదం గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ చ‌ర్చించ‌రంటూ స్ప‌ష్టం చేశారు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి.

పాకిస్తాన్ మంత్రి భుట్టో ఎస్ సి వో స‌భ్య దేశానికి విదేశాంగ మంత్రిగా వ‌చ్చారు. ఇది బహుపాక్షిక దౌత్యంలో భాగం. ఇంత‌కు మించి ఇంకేమీ మాట్లాడేందుకు ఏమీ లేద‌న్నారు సుబ్ర‌మ‌ణ్యం జై శంక‌ర్(S Jai Shankar). ఉగ్ర‌వాదంపై పాకిస్తాన్ విశ్వ‌స‌నీయ‌త దాని ఫారెక్స్ నిల్వ‌ల కంటే వేగంగా క్షీణిస్తోంద‌న్నారు. పాకిస్తాన్ రుణాల కోసం అడుక్కోవాల్సిన పరిస్థితిని కోరి కొని తెచ్చుకుంటోంద‌న్నారు .

Also Read : నిన్న ‘ఫైల్స్’ నేడు కేర‌ళ స్టోరీ

Leave A Reply

Your Email Id will not be published!