Bindyarani Devi : వెయిట్ లిఫ్టింగ్ లో బింద్యారాణి దేవికి రజతం
కామన్వెల్త్ గేమ్స్ 2022లో సత్తా చాటిన క్రీడాకారులు
Bindyarani Devi : బ్రిటన్ లోని బర్మింగ్ హోమ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. మీరా బాయి చాను మొదటి బంగారు పతకాన్ని గెలుచుకుని చరిత్ర సృష్టించింది.
సరంగ్ కూడా త్రుటిలో బంగారు పతకాన్ని చేజార్చుకున్నాడు గాయం కారణంగా. కాంస్య పతకంతో సరి పెట్టుకున్నాడు. తాజాగా జరిగిన పోటీల్లో మహిళల 55 కేజీల వెయిట్ లిఫ్టింగ్ లో బింద్యా రాణి దేవి(Bindyarani Devi) సత్తా చాటింది.
రజత పతకాన్ని సాధించింది. ఆమె కూడా బంగారు పతకాన్ని కొద్ది పాటి తేడాతో కోల్పోయింది. దీంతో కామన్వెల్త్ గేమ్స్ 2022లో మొత్తం భారత దేశానికి సంబంధించి నాలుగు పతకాలకు చేరింది.
114 కేజీల తన రెండో క్లీన్ అండ్ జెర్క్ ప్రయత్నంలో విఫలం కావడంతో కాంస్య పతకంతో సరి పెట్టు కోవాల్సి వచ్చింది. కానీ ఆమె తన చివరి లిఫ్ట్ తో 116 కేజీల బరువును ఎగుర వేసి రెండో స్థానానికి ఎగ బాకింది.
ఇక నైజారీయాకు చెందిన ఆదిజత్ ఒలారినోయ్ బంగారు పతకాన్ని సాధించింది. ఆమె స్నాచ్ రౌండ్ లో 86 కిలోలు ఎత్తి క్లీన్ అండ్ జెర్క్ రౌండ్ లో 116 కిలోల లిఫ్ట్ ని కామన్వెల్త్ గేమ్స్ లో రికార్డు స్థాయిలో నమోదు చేసింది.
ఇక లోకల్ ఫేవరేట్ గా పేరొందిన ఫ్రెయర్ మారో మొత్తం 198 కిలోల లిఫ్ట్ తో మూడో స్థానంలో నిలిచారు. అంతకు ముందు మీరా బాయి చాను భారత్ కు తొలి స్వర్ణం అందించగా సంకేత్ సర్గర్ , గురురాజా పూజారి వరుసగా రజత, కాంస్య పతకాలను సాధించి భారత దేశానికి గర్వ కారణంగా నిలిచారు.
Also Read : రజత పతక విజేత సంకేత్ సర్గర్