Biological E Ltd : తెలంగాణలో బిఈ భారీ పెట్టుబడి
టీకాల ఉత్పత్తిలో హైదరాబాద్ టాప్
Biological E Ltd : టీకాలు తయారు చేస్తున్న హైదరాబాద్ కు చెందిన బీఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రూ. 1,800 కోట్లతో టీకాల ఉత్పత్తి చేసేందుకు వినియోగించనున్నది.
దీని వల్ల 2,500 మందికి పైగా ఉపాధి లభించనుంది. ఈ నిధులను టీకా ఉత్పత్తులు, పరిశోధన రంగంపై ఎక్కువగా ఖర్చు చేయనున్నట్లు బిఈ సంస్థ వెల్లడించింది.
ఈ పెట్టుబడుల వల్ల ప్రపంచంలో అత్యధికంగా వ్యాక్సిన్లు తయారు చేసే నగరంగా హైదరాబాద్ టాప్ లో ఉండనుంది.
బీఈ ఎండీ మహిమ దాట్ల మంత్రి కేటీఆర్ తో కలిశారు. అనంతరం తాము ఏర్పాటు చేయబోయే వాటి గురించి వెల్లడించారు.
జినోమ్ వ్యాలీలో ప్రస్తుతం ప్రతి ఏటా 900 కోట్ల వ్యాక్సిన్లు తయారవుతున్నాయి. బీఈ విస్తరిస్తే ఆ సంఖ్య 1,400 కోట్లకు చేరుకుంటుందని పేర్కొన్నారు మంత్రి కేటీఆర్.
ప్రత్యేకించి కోవిడ్ నివారణకు ఉపయోగించే టీకాలు, ఎమ్మార్ పీసీవీ, టైఫాయిడ్, ఐపీవీ, పెర్టుసిస్ వ్యాక్సిన్లు, టెటనస్ టాక్సైడ్ యాంపుల్స్ , జెనరిక్ ఇంజెక్టబుల్స్ ను తయారు చేయనున్నట్లు వెల్లడించారు మహిమ దాట్ల.
కరోనా కష్ట కాలంలో ప్రభుత్వం వెంటనే స్పందించిందని, మౌలిక వసతులు కల్పించినందుకు ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్(KTR) కు ధన్యవాదాలు తెలిపారు బీఈ సంస్థ(Biological E Ltd) ఎండీ మహిమ దాట్ల.
ప్రపంచంలోనే హైదరాబాద్ అత్యధికంగా టీకాలు తయారు చేసే నగరంగా ప్రసిద్ది చెందిందని చెప్పారు మంత్రి కేటీఆర్.
మౌలిక సదుపాయాలు, ప్రత్యేక ఆర్థిక మండళ్లు, వెబ్ లాబొరేటరీస్ కూడా ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జయేష్ రంజన్ పాల్గొన్నారు.
Also Read : ఫేస్ బుక్ భద్రత పట్ల మహిళల ఆందోళన