BJP Dual Posts Comment : ఒకరికి ఒకే పదవి సాధ్యమేనా
కమలంలో ట్రబుల్ షూటర్ ఏం చెబితే అదే
BJP Dual Posts Comment : భారతీయ జనతా పార్టీ అంటే ఒకప్పుడు లాల్ క్రిష్ణ అద్వానీ, అటల్ బిహారీ వాజ్ పేయ్ పేర్లు వినిపించేవి. కానీ ఇప్పుడు భౌతికంగా అటల్ జీ లేరు. సంప్రదాయ వాదానికి ప్రతీకగా ఉండేది ఆ పార్టీ.
కానీ టెక్నాలజీ మారింది. ఎప్పుడైతే నరేంద్ర మోదీ గుజరాత్ సీఎం నుంచి దేశానికి ప్రధాన మంత్రి రేసులో నిలిచారో ఆనాటి నుంచి నేటి
దాకా సీన్ మారింది. సిస్టం కూడా మారి పోయింది.
ఇవాళ దేశ ప్రధాన మంత్రులలో ఇందిరా గాంధీ తర్వాత అంతటి పేరు తెచ్చుకున్నది మోదీనేనని చెప్పక తప్పదు. ఇక 20వ శతాబ్దంలో సుదీర్గ రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి వణుకు పుట్టిస్తూ దూసుకు పోతోంది బీజేపీ.
ఇప్పుడు కాషాయం అంటేనే మోదీ త్రయం. ఒకరు మోదీ. ఇంకొకరు ట్రబుల్ షూటర్ గా పేరొందిన అమిత్ చంద్ర షా. మరొకరు జేపీ నడ్డా. మోదీ
ఎక్కువగా మాట్లాడరు. షా ఎంటర్ అయ్యాడంటే ఏదో ఒకటి జరగాల్సిందే.
అంతలా పాపులర్ అయ్యారు. ఇవాళ కేంద్రంలో బీజేపీ రెండోసారి పవర్ లోకి వచ్చేందుకు మోదీ చరిష్మా ఎక్కువగా పని చేసిందని
చెప్పక వచ్చు. మూడోసారి పవర్ లోకి వచ్చేందుకు దారులు సిద్దం చేసి ఉంచారు.
ఈ తరుణంలో ఒకరికి ఒకే పదవి అన్న నినాదం ఊపందుకుంది. ముందుగా చెప్పు కోవాల్సింది బీజేపీ సిద్దాంతం. ఒకే పార్టీ..ఒకే నినాదం..ఒకే పౌరసత్వం..ఒకే జాతి..ఒకే మతం ..ఒకే భాష ఉండాలన్నది.
ఈ తరుణంలో ప్రధాన మంత్రి మోదీ పలుమార్లు ఒకరికి ఒకే పదవి ఉండాలని(BJP Dual Posts) స్పష్టం చేశారు. కొందరు తమ పదవుల నుంచి తప్పుకున్నారు. కానీ అమిత్ షా ప్రస్తుతం కేంద్ర హోం శాఖ మంత్రిగా ఉన్నారు.
ఆయన తనయుడు జే షా అత్యంత కీలకమైన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)లో కార్యదర్శిగా ఉన్నారు. దీనిపై పార్టీలో కంటే
ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.
ఎందుకని ఒకే పదవిలో ఉండడం లేదని. ఈ నియమాలు బీజేపీలో కొందరికి వర్తించవా అంటూ. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక
ఆదాయం కలిగిన క్రీడా సంస్థగా పేరుంది బీసీసీఐకి.
పేరుకు దాదా చీఫ్ గా ఉన్నా మొత్తం నడిపిస్తోంది మాత్రం జే షా నేనన్న జోరుగా ప్రచారం జరుగుతోంది. రోజు రోజుకు అత్యాధునిక పోకడలు
పోతోన్న బీజేపీలో ప్రస్తుతం జే షా కు ఎందుకు పదవి కట్టబెట్టారని ప్రశ్నించే వారు లేరు.
ఎందుకంటే షా ఏం చెబితే అదే వేదం. అదే శాసనం. మోదీ తర్వాత పీఎం రేసులో షా ఉంటారని భావించారంతా. కానీ తానే పాట్నా వేదికగా క్లారిటీ ఇచ్చారు.
తదుపరి ఎన్నికల్లో ప్రధాని సారథ్యంలోనే వెళతామని. ఏది ఏమైనా జోడు పదవులు ఉండడం పార్టీ నియామావళికి విరుద్దమైనా కొన్ని సందర్భాలలో తప్పదేమో.
Also Read : జాతీయ జెండాతో ఆర్ఎస్ఎస్