BJP Files : సోనియా గాంధీపై చ‌ర్య‌లు తీసుకోవాలి

భార‌తీయ జ‌న‌తా పార్టీ డిమాండ్

BJP Files : భార‌త దేశం నుండి క‌ర్ణాట‌క‌ను విడ‌దీయాల‌ని కాంగ్రెస్ బ‌హిరంగంగా వాదిస్తోందంటూ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ(PM Modi) ఆరోపించారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఏఐసీసీ మాజీ చీఫ్ సోనియా గాంధీపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని బీజేపీ డిమాండ్ చేసింది. ట్విట్ట‌ర్ వేదిక‌గా నిప్పులు చెరిగింది.

ఆమెపై వెంట‌నే వేటు వేయాల‌ని కోరుతూ బీజేపీ కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ మేర‌కు లేఖ రాసింది. క‌ర్ణాట‌క ప్ర‌తిష్ట‌, సార్వ‌భౌమాధికారం లేదా స‌మ‌గ్ర‌త‌కు ముప్పు క‌లిగించేందుకు కాంగ్రెస్ పార్టీ ఎవ‌రినీ అనుమ‌తించ‌దు అని మే6న కాంగ్రెస్ ట్వీట్ చేసింది. దీనికి సోనియా గాంధీ బాధ్య‌త వ‌హించాల‌ని స్ప‌ష్టం చేసింది.

క‌ర్ణాట‌కకు చెందిన క‌న్న‌డిగులు జాతీయ‌వాదులు. శాంతి ప్రేమికులు. ప్ర‌గ‌తిశీల‌, ప్ర‌పంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్ర‌జ‌ల‌ను రెచ్చొగొట్టేలా ఈ ట్వీట్ ఉందంటూ పేర్కొంది భార‌తీయ జ‌న‌తా పార్టీ. ఓట్ల‌ను సంపాదించ‌డం కోసం క‌ర్ణాట‌క‌లో పొందే స‌మాన‌త్వం, సామ‌ర‌స్యం, శాంతికి భంగం క‌లిగించ‌డ‌మే దీని ఉద్దేశ‌మ‌ని తెలిపింది బీజేపీ(BJP Files). భార‌త రాజ్యాంగానికి ఇది పూర్తి విరుద్దం. సోనియా గాంధీ చేసిన వ్యాఖ్య‌ను దుర‌దృష్ట‌క‌రం, అనుచితం అని మండిప‌డింది భార‌తీయ జ‌న‌తా పార్టీ.

Also Read : ఓట్ల కోస‌మే ముస్లింల జ‌పం

Leave A Reply

Your Email Id will not be published!