Maharastra Crisis BJP : మ‌రాఠా పీఠంపై క‌న్నేసిన బీజేపీ

అయితే షిండే లేదంటే ఫ‌డ్న‌వీస్

Maharastra Crisis BJP : మహారాష్ట్ర‌లో కొలువు తీరిన శివ‌సేన‌, కాంగ్రెస్, ఎన్సీపీ సంకీర్ణ స‌ర్కార్ గా ఏర్ప‌డిన మ‌హా వికాస్ అఘాడీ రెండున్న‌ర ఏళ్ల పాల‌న‌లో ప‌డుతూ లేస్తూ వ‌చ్చింది. కేంద్రంలో కొలువు తీరిన భార‌తీయ జ‌న‌తా పార్టీ(Maharastra Crisis BJP) ఒక ర‌కంగా అన్ని ర‌కాలుగా ప్ర‌యోగాలు చేసింది.

మ‌రో వైపు గ‌త కొన్ని నెల‌ల కింద‌ట కేంద్ర మంత్రి నారాయణ రాణే సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. త్వ‌ర‌లోనే ప్ర‌భుత్వం కూలి పోవ‌డం ఖాయ‌మ‌న్నారు.

అన్న‌ట్టుగానే ప్ర‌స్తుతం శివ‌సేన‌లోనే తిరుగుబాటు జెండా ఎగుర వేశారు ఎమ్మెల్యేలు. మంత్రి ఏక్ నాథ్ షిండే తిరుగుబాటు వ‌ర్గానికి నేతృత్వం వ‌హిస్తున్నారు.

సందిట్లో స‌డేమియా అన్న చందంగా షిండేకు వెనుక నుంచి బీజేపీ స‌పోర్ట్ చేస్తోందంటూ ఇప్ప‌టికే శివ‌సేన పార్టీ జాతీయ అధికార ప్ర‌తినిధి, రాజ్య‌స‌భ ఎంపీ సంజ‌య్ రౌత్ సంచ‌ల‌న ఆరోపించారు.

ఇందులో భాగంగా ట్ర‌బుల్ షూట‌ర్, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాతో భేటీ అయ్యారు. అనంత‌రం నేరుగా మ‌రాఠాకు వ‌చ్చారు. గ‌వ‌ర్న‌ర్ కోషియార్ ను క‌లిసి విన‌తిప‌త్రం స‌మ‌ర్పించారు.

ప్ర‌స్తుత మ‌హా వికాస్ అఘాడీలో సంక్షోభం నెల‌కొంద‌ని, ఆ స‌ర్కార్ మైనార్టీలో ప‌డి పోయింద‌ని తెలిపారు. వెంట‌నే బ‌ల ప‌రీక్షకు ఆదేశించాల‌ని కోరారు.

మొత్తంగా బీజేపీ ప్ర‌భుత్వం ఏర్పాటు చేయాల‌ని డిసైడ్ అయ్యింది. ఇక షా, ఫ‌డ్న‌వీస్ మ‌ధ్య జ‌రిగిన చ‌ర్చ‌ల్లో సీనియ‌ర్ న్యాయవాది రామ్ జెఠ‌ల్మానీ కూడా పాల్గొన్న‌ట్లు స‌మాచారం.

ప్ర‌భుత్వ ఏర్పాటుకు అందుబాటులో ఉన్న ప‌లు అవ‌కాశాల‌పై సీరియ‌స్ గా చ‌ర్చించిన‌ట్లు టాక్. మొత్తంగా ఫ‌డ్న‌వీస్ మ‌రోసారి సీఎం అవుతారా లేదా షిండేకు చాన్స్ ద‌క్కుతుందా అన్న‌ది తేలాల్సి ఉంది.

Also Read : ట‌చ్ లో ఉన్న వారెవ‌రో చెప్పండి – షిండే

Leave A Reply

Your Email Id will not be published!