Pralhad Joshi : కాంగ్రెస్ నేతల ప్రసంగాలపై భగ్గుమన్న బీజేపీ నేత ప్రహ్లాద్ జోషి
Pralhad Joshi : కాంగ్రెసోళ్ల ప్రసంగం వింటుంటే… దెయ్యం నోటి నుంచి భగవద్గీత విన్నట్లుగా ఉందని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి విమర్శించారు. కాంగ్రెస్ చాలాసార్లు రాజ్యాంగాన్ని అవమానించిందని ఆయన చెప్పారు. ఎమర్జెన్సీ సమయంలో వారు బాబా సాహెబ్ అంబేద్కర్‌ను కూడా అవమానించిన విషయం అందరికీ తెలుసన్నారు.
Pralhad Joshi Slams..
దేశంలోని అనేక రాష్ట్రాల్లో ప్రజలు ఇప్పటికే కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పారని, ఇప్పటికైనా బుద్ది నేర్చుకుని పార్లమెంట్ సమావేశాలు సజావుగా నిర్వహించేందుకు సహకరించాలని కోరారు. రైతుల నిరసన గురించి మాట్లాడుతూ, సంబంధిత మంత్రిత్వ శాఖ దీనిని పర్యవేక్షిస్తోందని, అయితే దాని గురించి తమ వద్ద ఎటువంటి సమాచారం లేదని అన్నారు.
Also Read : Rain Alert : బంగాళాఖాతంలో మరోసారి ముంచుకొస్తున్న అల్పపీడనం