BJP Menu : క‌మ‌ల‌నాథుల‌కు ప‌సందైన వంట‌లు

బీజేపీ నాలుగు రోజు స‌మావేశాల కోసం

BJP Menu : భాగ్య‌న‌గ‌రం కాషాయ‌మయం అయ్యింది. గ‌తంలో ఎన్న‌డూ లేని రీతిలో భారీ ఎత్తున భార‌తీయ జ‌న‌తా పార్టీ ఏర్పాట్ల‌లో నిమ‌గ్న‌మైంది. నాలుగు రోజుల పాటు హైద‌రాబాద్ లో జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశాలు జ‌ర‌గ‌నున్నాయి.

ఈ సంద‌ర్భంగా దేశంలోని బీజేపీకి చెందిన ముఖ్య‌మంత్రులు, డిప్యూటీ సీఎంలు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, సీనియ‌ర్ నాయ‌కులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున త‌ర‌లి రానున్నారు.

ఇప్ప‌టికే కేంద్ర హోం శాఖ ఈ ఏర్పాట్ల‌పై ఫోక‌స్ పెట్టింది. దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ హైద‌రాబాద్ కు రానున్నారు. ఇవాళ పార్టీ చీఫ్ జేపీ న‌డ్డా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా భారీ ర్యాలీ చేప‌ట్టారు.

ఇదిలా ఉండ‌గా బీజేపీ తెలంగాణ రుచుల‌తో(BJP Menu) పాటు దేశ వ్యాప్తంగా ఉన్న వంట‌కాల‌ను సిద్దం చేసింది. ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ కానున్నాయి. మొత్తం భాగ్య‌న‌గ‌రం పోలీసుల మ‌యంగా మారింది.

ఇవాల్టి నుంచి సోమ వారం దాకా భోజ‌నాల మెనూను సిద్దం చేశారు. మొద‌టి రోజు శుక్ర‌వారం క్యారెట్ రైజిన్ , వెజిట‌బుల్ శాండ్ విచ్ , ప్రైడ్ చిల్లీ,

గార్లిక్ పౌడ‌ర్ , మింట్ చ‌ట్నీ, న‌మ‌క్ ప‌రా, బ్రెడ్ ప‌కోడా , డ్రై ఫ్రూట్ టీకేక్ , పాప‌డ్ , ఆలూ ఔర్ మూంగ్ దాల్ కీ టిక్కీ, ప‌నీర్ టిక్కా,

బంగాళా దుంప పాప‌డ్ , కచుంబ‌ర్ స‌లాడ్ , ధ‌నియా చాట్ , ధోక్లా, గ్రీన్ స‌లాడ్ , పెరుగ‌న్నం, వ‌డియాలు, గోంగూర ఊర‌గాయ‌, గోంగూర రోటి ప‌చ్చ‌డి వ‌డ్డిస్తారు.

వీటితో పండ్లు, అన్నానికి ఇత‌ర కూర‌గాయాలు కూడా వ‌డ్డిస్తారు. రెండో రోజు శ‌నివారం వంకాయ ప‌కోడి, దాల్ మ‌ఖానీ, దాల్ త‌డ్కా, సాంబార్ ,

రొట్టెలు, మిల్లెట్స్ తో కిచిడీలు, హైద‌రాబాద్ బిర్యానీ, ద‌మ్ బిర్యానీ, కుబూలీ బిర్యానీ, మోటియా బిర్యానీ, దోస‌కాయ రైతా, మిర్చ్ కా స‌లాన్ ,

దోస‌, ఊత‌ప్పం, ఉప్మా, పాల‌క్ దోశ‌, స్వీట్స్ కూడా విరివిగా ఉన్నాయి.

మూడో రోజు ఆదివారం రోజున ట‌మాటా కూర‌, మెంతికూర ఆలుగ‌డ్డ‌, వంకాయ మ‌సాలా, దొండ‌కాయ కొబ్బ‌రి ఫ్రై, బెండ‌కాయ కాజుపల్లి ఫ్రై ,

తోట‌కూర టమాటా ఫ్రై, బీర‌కాయ పాల‌కూర, గంగ‌వాయిలి మామిడికాయ ప‌ప్పు, మెంతి పెస‌ర‌పప్పు, చ‌నా మ‌సాలా, ప‌ప్పు చారు,

ప‌చ్చి పులుసు, ముద్ద‌ప‌ప్పు, బ‌గారా అన్నం, పులిహోర‌, పుదీనా రైస్ , తెల్ల అన్నంతో పాటు స్వీట్లు వ‌డ్డిస్తారు.

నాలుగో రోజు సోమ‌వారం వెరీ స్పెషల్ గా వ‌డ్డించ‌నున్నారు.

Also Read : ఛాయ్ క‌హానీ హైద‌రాబాద్ బిర్యానీ

Leave A Reply

Your Email Id will not be published!