#IraniChai : ఛాయ్ క‌హానీ హైద‌రాబాద్ బిర్యానీ

టీఓ క్లాక్ ఛాయ్ అడ్డా

Irani Chai : ఓహ్..హైద‌రాబాద్ అంటేనే ప్యార‌డైజ్ బిర్యానీకి పెట్టింది పేరు. అంతేనా ప్ర‌తి గ‌ల్లీలో ఓ టీకొట్టు ఉండాల్సిందే. ఇరానీ ఛాయ్ కి కేరాఫ్ ఈ న‌గ‌ర‌మే. ఎక్క‌డికి వెళ్లినా ..ఏ సందులోకి దూరినా అక్క‌డ ఇరానీ కేఫ్ ఉంటుంది. అంతేనా గ‌రం గ‌రం టీతో పాటు నోరూరించే ఉస్మానియా బిస్క‌ట్లు కూడా నోరూరిస్తాయి. అంత‌లా పాపుల‌ర్ అయ్యిందీ ఈ సిటీ.

పిల్ల‌ల ద‌గ్గ‌ర నుండి పెద్ద‌వారి దాకా అంతా ఛాయ్ ప్రియులే. పొద్దున లేస్తేనే ముందుగా గుర్తుకు వ‌చ్చేది టీనే. ర‌క‌ర‌కాల ఫ్లేవ‌ర్స్ అందుబాటులోకి వ‌చ్చాయి. టీ ప్రియుల కోసం ప్ర‌త్యేకంగా రెస్టారెంట్లు వెలిశాయి. త‌క్కువ ఖ‌ర్చు ..ఎక్కువ ఆదాయం ఏద‌న్నా ఉందంటే అది టీ కొట్టు..టీ హోట‌ల్, టీ అడ్డా.

మేధావులు, క‌ళాకారులు, సినీ న‌టులు, ద‌ర్శ‌కులు, క్రియేటివిటీ కోసం నానా తిప్ప‌లు ప‌డే వాళ్లంద‌రికీ ఇష్ట‌మైన‌ది ఏదైనా ఉందంటే ఛాయ్ నే. వేడి వేడి టీ గొంతులోకి వెళితే ఆ టేస్ట్ వేరు. ఆ మ‌జా వేరు. ఆంధ్రా వారి దెబ్బ‌కు తెలంగాణ సంస్కృతి దెబ్బ‌తిన్న‌ది. కానీ బ‌తక‌డంలో మాత్రం త‌న సంస్కృతిని కోల్పోలేదు.

తెలంగాణ‌లో ఎక్క‌డికి వెళ్లినా మ‌జ్జిగ‌నో లేదా టీనో త‌ప్ప‌కుండా ఇస్తారు. తేనీటి విందు త‌ప్ప‌నిస‌రి. హైద‌రాబాద్ ఐటీ హబ్‌గా మారి పోయాక‌..సిగ‌రెట్లు, పాన్ ప‌రాక్‌లు, ప‌బ్ లు, రెస్టారెంట్లు, బార్లు ఎక్కువగా వెలిశాయి. ప‌బ్ ..ఫారిన్ క‌ల్చ‌ర్ ఎక్కువ‌గా డెవ‌ల‌ప్ అయింది. డ‌బ్బున్న వాళ్లు, వ్యాపార‌స్తులు ఎంద‌రో హైద‌రాబాద్‌లో పెట్టుబ‌డులు పెట్టారు.

టీ కార్న‌ర్, టీ హోట‌ళ్లు, టీ బండ్ల‌కు ఎక్కువగా గిరాకీ ఉంటోంది. త‌క్కువ ధ‌ర ..ఎక్కువ కిక్ ఇచ్చేది ఏదైనా ఉందంటే అది ఛాయ్ ఒక్క‌టే. ఛాయ్ స్పాట్స్ మ‌రింత పాపుల‌ర్ అయ్యాయి న‌గ‌రంలో. యూత్ ట్రెండ్ కు త‌గ్గ‌ట్టు 50 నుంచి 100 ర‌కాల ఛాయ్‌లు క్ష‌ణాల్లో అంద‌జేస్తున్నారు నిర్వాహ‌కులు. ఇపుడు జ‌నానికి ఇదో మంచి ఆదాయం స‌మ‌కూరుతోంది.

టీ కొట్టుల అడ్డాగా మారిపోయింది ఈ న‌గ‌రం. పాప్ ఓ బాబ్ పేరుతో ప్ర‌త్యేకించి టీ ఫ్లేవ‌ర్ ఈ మ‌ధ్య న‌గ‌ర వాసుల్ని ఆక‌ట్టుకుంటోంది. సాయి మిల్క్, డెయిరీ ఫ్రీ క్రీమ‌ర్ తో టీని(Irani Chai )త‌యారు చేస్తారు. ఈ టీని సేవించాలంటే న‌గ‌రంలోని సోమాజీగూడ‌, కొత్త‌గ‌గూడ‌, కూకట్ ప‌ల్లి, ఫిల్మ్ న‌గ‌ర్ , శంషాబాద్ ల‌లో దొరుకుతుంది. మీడౌ మ‌స్తీ పేరుతో ఏకంగా టీ ప్రియుల కోస‌మే రెస్టారెంట్ వెలిసింది.

ఇది బ‌షీర్ బాగ్‌లో ఉంది.తండూరీ టీ దీని స్పెషాలిటీ. ల‌మ‌కాన్ ..ఇక్క‌డ ఎక్కువ‌గా స‌మావేశాలు జ‌రుగుతాయి. నిరంత‌రం ఏదో ఒక ప్రోగ్రాం ఉండ‌నే ఉంటుంది. ఇక్క‌డ ల‌భించే టీ ఎక్క‌డా దొర‌క‌దు. అంత టేస్ట్ గా టీ ఉంటుంది. ఇక్క‌డ స‌మోసాలు మ‌రింత రుచిక‌రంగా మ‌ళ్లీ తినాల‌నిపిస్తాయి.

జీవికే మాల్ ద‌గ్గ‌ర‌లోనే ఉంది. ల‌వ్లీ ఇరానీ ఛాయ్ (Irani Chai ) కావాలంటే మాత్రం మాసాబ్ టాంక్ ద‌గ్గ‌ర ఛాయ్ టాక్ రెస్టారెంట్ కు వెళ్లాల్సిందే. కావాల్సిన ఫ్లేవ‌ర్స్ దొరుకుతాయి. అంద‌రికీ అందుబాటు ధ‌ర‌ల్లో చాయ్ పానీ అందిస్తోంది. ఇది బంజారా హిల్స్‌లో ఉంది.
ఇక్క‌డ కోల్‌క‌తా కుల్హాద్ లేదా పంజాబ్ కేసీరి ఛాయి దొరుకుతుంది.

ఐస్ క్రీమ్ తో త‌యారు చేసిన టీ ఇక్క‌డి స్పెషాలిటీ. టీ ప్లానెట్ ఇది స్పెష‌ల్‌గా ఆర్గానిక్, బ‌యో డైన‌మిక్, హెర్బ‌ల్ ప్రొడ‌క్ట్స్‌తో టీ దొరుకుతుంది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాధాపూర్, సైనిక్ పురిలో ల‌భ్య‌మ‌వుతుంది. మందులు లేని వాడ‌ని టీ ల‌భిస్తుంది.

ఛాయ్ క‌హానీ ఇది మోస్ట్ పాపుల‌ర్ టీ కార్న‌ర్. జూబ్లి హిల్స్, కొంప‌ల్లి, మాధాపూర్, సైనిక్ పురిల‌లో దొరుకుతుంది. సో ఛాయ్ ప్రియులంతా రోజూ ఒక‌టే ఛాయ్ తాగితే ఏం మ‌జా ఉంటుంది. డిఫ‌రెంట్ ఫ్లేవ‌ర్స్ క‌లిగిన టీ (Irani Chai )తాగితే ఆ మ‌జాయే వేరు.. ఆరుచినే వేరు.

No comment allowed please