Prajwal Revanna: బయటపడిన మాజీ ప్రధాని దేవెగౌడ మనువడి రాసలీలలు ! వెయ్యికిపైగా వీడియోలు !

బయటపడిన మాజీ ప్రధాని దేవెగౌడ మనువడి రాసలీలలు ! వెయ్యికిపైగా వీడియోలు !

Prajwal Revanna: లోక్ సభ ఎన్నికల వేళ కర్ణాటక రాజకీయాల్లో అశ్లీల వీడియోల కలకలం రేగింది. మాజీ ప్రధాని, జేడీఎస్‌ అగ్రనేత దేవెగౌడ మనువడి రాసలీలలు దేశ వ్యాప్తంగా పెను దుమారాన్ని రేపుతున్నాయి. మాజీ సీఎం కుమార స్వామి సోదరుడి కుమారుడు, హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన పోలీసుల విచారణలో వెయ్యికిపైగా అమ్మాయిలతో శృంగారంలో పాల్గొన్న వీడియోలు బయటపడ్డాయి. యువతులను లొంగదీసుకుని లైంగిక కోరికలు తీర్చుకోవడమే టార్గెట్‌ గా ఎంతో మంది మహిళల జీవితాలను నాశనం చేశాడని బాధితులు ఆరోపిస్తున్నారు. వారి ఆరోపణలకు బలం చేకూరుస్తూ వీడియోలు బయటపడటం జేడీఎస్‌లో కలకలం రేపుతోంది. అయితే ఇప్పటికే ప్రజ్వల్ రేవణ్ణ విదేశాలకు పారిపోయిన సంగతి తెలిసింది.

Prajwal Revanna Videos Viral

మాజీ మంత్రి హెచ్‌డీ రేవణ్ణ, ఎంపీ ప్రజ్వల్‌(Prajwal Revanna) పై… తమ సమీప బంధువు లైంగిక దౌర్జన్యం ఆరోపణలు చేయడం కర్ణాటక రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. ప్రజ్వల్ తల్లి భవానీకి బాధితురాలు స్వయానా మేనత్త కుమార్తె కావడం గమనార్హం. రేవణ్ణ మంత్రిగా ఉన్నప్పుడు ఆమెకు పాల కేంద్రంలో, వసతి గృహంలో పని కల్పించాడు. ఆ తరువాత 2015లో ఆమెను వారి ఇంట్లో పనికి చేర్పించారు. రేవణ్ణ నివాసంలో ఆరుగురు మహిళలు, యువతులు పని చేసేవారు. ఇంట్లో చేరిన కొన్నాళ్లకే తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలు వాపోయింది. స్టోర్ రూంకి పిలిపించుకుని అసభ్యంగా ప్రవర్తించేవాడని… స్నానం చేయించాలని చెప్పి బాత్‌రూంకి తీసుకెళ్లి లైంగికంగా వేధించేవాడని ఆమె ఆరోపించింది. తననే కాకుండా తన కుమార్తెనూ ప్రజ్వల్ వదల్లేదని.. అతనికి భయపడి ఫోన్ నంబర్ బ్లాక్ చేసిందని వివరించింది. కొన్నాళ్లకు తాను పని మానేసి బయటకి వచ్చేశానని… వీడియోలు బయటకు రావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో మాట్లాడుతున్నానని బాధితురాలు వాపోయింది.

జేడీఎస్ ఎంపీ రాసలీల ఆరోపణలపై కర్ణాటక ప్రభుత్వం సిట్‌ ఏర్పాటు చేసింది. ఏడీజీపీ బీకే సింగ్‌ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) ఏర్పాటు చేశామని రాష్ట్ర హోం మంత్రి పరమేశ్వర్‌ ఆదివారం ప్రకటించారు. కాగా.. అశ్లీల వీడియోల అంశం హల్‌చల్‌ చేస్తున్న సమయంలోనే ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ(Prajwal Revanna) జర్మనీలోని ఫ్లాంక్‌ ఫర్ట్‌ కు వెళ్లిపోవడం మరిన్ని అనుమానాలకు దారితీస్తోంది. అయితే సిట్‌ దర్యాప్తులో భాగంగా ఆయన్ని వెనక్కి తీసుకువచ్చి విచారిస్తామని పరమేశ్వర్‌ తెలిపారు. ప్రజ్వల్ వీడియోలు తీసి వాటి ఆధారంగా అమ్మాయిలను లోబరుచుకునేవాడని కొందరు ఆరోపిస్తున్నారు. అలా ఏకంగా 3 వేలకుపైగా వీడియోలు తీశాడని… వెయ్యి మందికిపైగా మహిళలపై అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

మరోవైపు.. ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణకు సంబంధించి పలు వీడియోలు ప్రస్తుతం రాష్ట్రమంతటా వైరల్‌ గా మారాయి. ప్రజ్వల్‌ రేవణ్ణ పలువురు మహిళలతో అశ్లీలంగా ఉన్న వీడియోలు వెలుగులోకి వచ్చాయి. దీనితో బాధిత మహిళలు న్యాయం చేయాలని టీవీ చానళ్లు, మహిళా కమిషన్‌ ను ఆశ్రయిస్తున్నారు. ప్రజ్వల్‌(Prajwal Revanna) అశ్లీల వీడియోలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ నాగలక్ష్మి చౌదరి సీఎంకు లేఖ రాశారు. ఈ విషయమై ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ బెంగళూరులో మాట్లాడుతూ.. ప్రజ్వల్‌ దేశం విడిచి పారిపోవడం సిగ్గుచేటన్నారు. కాగా.. తన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కావాలని మార్ఫింగ్‌ వీడియోలను ప్రచారం చేశారని ప్రజ్వల్‌ రేవణ్ణ ఆరోపించారు.

Also Read : Akshay Kanti Bam: నామినేషన్‌ వెనక్కి తీసుకుని కాంగ్రెస్‌ కు షాక్‌ ఇచ్చిన ఇండోర్‌ అభ్యర్థి !

Leave A Reply

Your Email Id will not be published!