Kodi Katti Srinu: టీడీపీలో చేరిన కోడికత్తి శ్రీను !

టీడీపీలో చేరిన కోడికత్తి శ్రీను !

Kodi Katti Srinu: 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన కోడికత్తి కేసులో ప్రధాన నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆదివారం ముమ్మడివరం కూటమి అభ్యర్థి, టీడీపీ నాయకుడు దాట్ల బుచ్చిబాబు సమక్షంలో కోడికత్తి శ్రీను ఆ పార్టీలో చేరారు. 2019 ఎన్నికలకు ముందు విశాఖ ఎయిర్ పోర్ట్ లో అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై కోడి కత్తితో హత్యాయత్నం చేసాడు. ఈ నేపథ్యంలో ఈ కోడికత్తి కేసు రాష్ట్ర రాజకీయాల ముఖ చిత్రం పూర్తిగా మార్చేసింది.

Kodi Katti Srinu Joined…

వైసీపీ అధికారంలోనికి రావడానికి వైఎస్ వివేకానంద రెడ్డి(YS Vivekananda Reddy) హత్యతో పాటు కోడికత్తి కీలక పాత్ర పోషించిందనడంలో ఏమాత్రం సందేహం లేదు. అప్పట్లో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈ కేసు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కు అప్పగించారు. ఈ కేసును ఎన్ఐఏ సుధీర్ఘ విచారణ జరిపింది. ఆ సమయంలో సీఎం వైయస్ జగన్ ఒక్క సారి కూడా కోర్టుకు హాజరుకాలేదు. దీనితో వైసీపీ అధికారంలోనికి వచ్చిన తరువాత గత నాలుగున్నరేళ్ళుగా రాజమండ్రి, విశాఖపట్నం సెంట్రల్ జైల్ లో రిమాండ్ ఖైదీగా ఉన్న కోడికత్తి శ్రీను ఎట్టకేలకు బెయిల్ పై విడుదలయ్యారు.

ఈ సందర్భంగా కోడికత్తి శ్రీను మాట్లాడుతూ… వైసీపీ అధినేత వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం కోసం… తాను చేసిన ప్రయత్నం వల్ల తాను ఐదేళ్లు జైల్లో మగ్గాల్సి వచ్చిందన్నారు. జైలు నుంచి తన విడుదల కోసం అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. తాను వైసీపీని ఎంతగానో అభిమానించానని… కానీ తాను జైలు నుంచి విడుదలయ్యేందుకు ఆ పార్టీ నుంచి ఏ ఒక్కరు కనీసం సహకరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జైలు నుంచి తన విడుదలకు కారణమైన ప్రతీ ఒక్కరికి ఈ సందర్భంగా కోడికత్తి శ్రీను ధన్యవాదాలు తెలిపారు. తాను బతికి ఈ రోజు ఇలా ఉండడానికి ప్రతిపక్షాలు, ఎస్సీ సంఘాలే కారణమని కోడికత్తి శ్రీను అభిప్రాయపడ్డారు. ఇక ఈ ఎన్నికల్లో స్వతంత్ర్య అభ్యర్థిగా తాను బరిలో దిగాలని తొలుత నిర్ణయించు కున్నానని… కానీ పరిస్థితులు అందుకు అనుకూలించకపోవడంతో టీడీపీలో చేరాల్సి వచ్చిందని కోడికత్తి శ్రీను వివరించారు.

Also Read : Brother Anil Kumar: సీఎం జగన్‌ పై బ్రదర్ అనిల్ సంచలన వ్యాఖ్యలు !

Leave A Reply

Your Email Id will not be published!