YS Sharmila: సీఎం జగన్‌ కు షర్మిల బహిరంగ లేఖ

సీఎం జగన్‌ కు షర్మిల బహిరంగ లేఖ

YS Sharmila: సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో బడుగు బలహీనవర్గాల జీవన ప్రమాణాలు అధ్వానంగా మారాయని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. రాష్ట్రంలో రాజ్యాంగపరంగా దక్కాల్సిన హక్కులకు కూడా దిక్కులేని పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. ఈ మేరకు ఆమె సీఎం జగన్‌ కు ఓ బహిరంగ లేఖ రాశారు. బడుగు,బలహీన వర్గాల నిధులు దారి మళ్లించి బడ్జెట్‌ పరంగా ఉపప్రణాళికను మంటగలిపారని దుయ్యబట్టారు.

YS Sharmila Letter

‘‘మీరు అధికారంలోకి వచ్చేదాకా కొనసాగుతున్న 28 పథకాలను నిర్లక్ష్యంగా నిలిపేశారు. దళితులపై దాష్టీకాలు పెరుగుతున్నా పట్టనట్లే ఉన్నారు. దాడులు నివారించి వారిని కాపాడే నిర్దిష్ట చర్యలు లేవు. దాడులు చేసినవారిలో ఎక్కువమంది మీ పార్టీకి చెందిన పెత్తందార్లే. ఎస్సీలకు మేలు చేయకపోగా కీడు చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు జరిగిన అన్యాయానికి క్షమాపణలు కోరండి. ఇకపై ఏ వివక్షా లేకుండా జాగ్రత్తలు తీసుకుంటామని మాటివ్వండి. బాధ్యత కలిగిన రాజకీయ పక్షంగా కాంగ్రెస్‌ తరఫున ఇదే మా డిమాండ్‌’’ అని షర్మిల తన లేఖలో పేర్కొన్నారు.

Also Read : Chandrababu Naidu: అది మేనిఫెస్టో కాదు… జగన్‌ రాజీనామా పత్రం – చంద్రబాబు

Leave A Reply

Your Email Id will not be published!