Chandrababu Naidu: అది మేనిఫెస్టో కాదు… జగన్‌ రాజీనామా పత్రం – చంద్రబాబు

అది మేనిఫెస్టో కాదు... జగన్‌ రాజీనామా పత్రం - చంద్రబాబు

Chandrababu Naidu: వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ ప్రకటించిన నవరత్నాలు ప్లస్ మేనిఫెస్టో కాదని… జగన్ రాజీనామా పత్రం అని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ఎద్దేవా చేసారు. నెల్లూరు జిల్లా కోవూరులో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో వైసీపీ మేనిఫెస్టోపై తనదైన శైలిలో సెటైర్లు వేసారు. ఈ సందర్భంగా చంద్రబాబు(Chandrababu Naidu) మాట్లాడుతూ… ‘‘యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా వారి భవిష్యత్‌ తో ఆడుకున్నారు. మేం అధికారంలోకి రాగానే అంగన్వాడీ కార్యకర్తలు, హోంగార్డులకు జీతాలు పెంచుతాం. ప్రభుత్వ ఉద్యోగులను జగన్‌ బానిసలుగా చూస్తున్నారు. మద్యం దుకాణాల వద్ద టీచర్లను కాపలాపెట్టారు. ఐదేళ్లలో ఒక్క రహదారైనా వేశారా? బటన్‌ అందరూ నొక్కుతారు.. బటన్‌ నొక్కడానికి సీఎం కావాలా? రూ.14లక్షల కోట్లు అప్పు తెచ్చి సైకో జగన్‌ చేతులెత్తేశారు. ఏపీకి రాజధాని ఉందా? రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన దుర్మార్గుడు జగన్‌. రైతు బజార్లు తాకట్టు పెట్టి జగన్‌ అప్పులు తెచ్చాడని విమర్శించారు.

Chandrababu Naidu Slams

ఈ ప్రభుత్వం ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్‌ అయినా ఇచ్చిందా? గొడ్డలి పెట్టుకుని తిరిగే ముఖ్యమంత్రి కావాలా? పిచ్చోడి దగ్గర అధికారం ఉంటే ఏమైనా అవుతుంది. జగన్‌ ప్రకటించింది మేనిఫెస్టో కాదు.. రాజీనామా పత్రం. గులకరాయి ఎవరికీ కనబడలేదు.. అయినా జగన్‌కు గాయం అయ్యింది. అప్పుడు కోడి కత్తి.. ఇప్పుడు గులకరాయి డ్రామా. జే బ్రాండ్‌, గంజాయి వల్ల రాష్ట్రం సర్వనాశనమైంది. జగన్‌ చేసిన ఘోరాలు చెప్పుకొంటూ పోతే ఐదేళ్లైనా సరిపోదు. సమర్థవంతమైన నాయకుడంటే పరిశ్రమలు తీసుకురావాలి. కేంద్రంలో అధికారంలోకి వచ్చేది ఎన్డీయే ప్రభుత్వమే. కాంగ్రెస్‌, బీజేపీతో ఉండనని చెబుతున్న జగన్‌… కేంద్రంలో ఎవరికి మద్దతిస్తారో చెప్పాలి? నేరాలు.. ఘోరాలు చేయడంలో జగన్‌ పీహెచ్‌డీ చేశారు కానీ, ఆర్థిక వ్యవస్థ ఏమీ తెలియని వ్యక్తి. దోచుకోవడం.. దాచుకోవడంలో మాత్రం మంచి ఎక్స్‌పర్ట్‌’’ అని చంద్రబాబు విమర్శించారు.

Also Read : KCR: సోషల్‌ మీడియాలోకి కేసీఆర్‌ ఎంట్రీ !

Leave A Reply

Your Email Id will not be published!