KTR: కేటీఆర్‌ కు నిరసన సెగ ! టమాటాలు, కోడిగుడ్లతో దాడి !

కేటీఆర్‌ కు నిరసన సెగ ! టమాటాలు, కోడిగుడ్లతో దాడి !

KTR: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు కు నిరసన సెగ తగిలింది. లోక్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం నిర్మల్‌ జిల్లాలోని భైంసాలో నిర్వహించిన రోడ్ షోలో కేటీఆర్ కు చేదు అనుభవం ఎదురైంది. బహిరంగ సభలో కేటీఆర్ ప్రసంగిస్తుండగా కొందరు కేటీఆర్‌కు వ్యతిరేకంగా ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఫ్లకార్డులతో ఆయన వాహనంవైపు వెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని నిలువరించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీనితో కేటీఆర్‌ ప్రసంగిస్తుండగా.. జన సమూహంలో నుంచి కొందరు కేటీఆర్ పై ఉల్లిగడ్డలు, కోడిగుడ్లు టమాటాలు విసిరారు. అయితే ఇవి ప్రచార వాహనం సమీపంలో కిందపడ్డాయి. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీటింగ్‌ పూర్తయిన తర్వాత ఆందోళన కారులను పోలీసులు చెదరగొట్టారు. ప్రసంగం ముగించుకొని నిర్మల్‌కు కేటీఆర్ బయలు దేరారు.

KTR Facing Issues

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ… రాముని గుడి కడితే బీజేపీకి లోక్‌ సభ ఎన్నికల్లో ఓటు వేయాలా అని మాజీ మంత్రి కేటీఆర్(KTR) ప్రశ్నించారు. అలా అంటే మాజీ సీఎం కేసీఆర్ కూడా యాదాద్రి ఆలయాన్ని నిర్మించారని గుర్తుచేశారు. ఆధునిక దేవాలయాల లాంటి కాళేశ్వరం ప్రాజెక్టు, పాలమూరు ఎత్తి పోతల నిర్మించారని ఉద్ఘాటించారు. పదేళ్లలో చేసిందేమి చెప్పుకోలేకనే దేవుడి పేరుతో మోదీ ఓట్లు అడుగుతున్నారని విరుచుకుపడ్డారు. రాముడు అందరి వాడు, ఒక బీజేపీ నేతలకు మాత్రమే దేవుడు కాదని హితవు పలికారు. మత రాజకీయం చేస్తున్న బీజేపీని ప్రజలు చిత్తు చిత్తుగా ఈ ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు.హామీల అమల్లో విఫలమైన కాంగ్రెస్‌కు కర్రు కాల్చి వాత పెట్టాలని కేటీఆర్ హెచ్చరించారు.

Also Read : Chandrababu Naidu: అధికారంలోనికి వచ్చిన 24 గంటల్లో ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టు రద్దు చేస్తా – చంద్రబాబు

 

Leave A Reply

Your Email Id will not be published!