Pawan Kalyan: సినీ ప్రముఖుల నుండి పవన్‌ కళ్యాణ్‌ కు పెరుగుతున్న రాజకీయ మద్దత్తు !

సినీ ప్రముఖుల నుండి పవన్‌ కళ్యాణ్‌ కు పెరుగుతున్న రాజకీయ మద్దత్తు !

Pawan Kalyan: పిఠాపురం అసెంబ్లీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న ప్రముఖ సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు సినీ ప్రముఖుల నుండి మద్దత్తు రోజు రోజుకూ పెరుగుతోంది. పవన్ కళ్యాణ్ కు మద్దత్తుగా ఇప్పటికే జబర్ధస్త్ నటులతో పాటు నిర్మాత నాగవంశీ, బన్నీ వాస్ తదితరులు ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే గత ఐదేళ్ళుగా టాలీవుడ్ లో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ విషయంలో కక్ష్య సాధింపు చర్యలకు దిగిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటానికి సినీ ప్రముఖులు విముఖత వ్యక్తం చేస్తున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ కు మద్దత్తుగా మాట్లాడిన నేచురల్ స్టార్ నాని సినిమా రిలీజ్ విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరుతో సినిమా రంగానికి చెందిన వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే సాహసం చేయలేదు. ఈ నేపథ్యంలో పిఠాపురం బరిలో దిగిన పవన్ కళ్యాణ్ కు సినిమా రంగం నుండి ఎలాంటి మద్దత్తు లభిస్తుందనే దానిపై ఆశక్తి నెలకొంది.

Pawan Kalyan Support

పిఠాపురం బరిలో దిగిన పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కు మద్దత్తుగా ఇప్పటికే వరుణ్ తేజ్, సాయి ధుర్గాతేజ్, పంజా వైష్ణవ్ తేజ్ ప్రచారం నిర్వహించారు. వీరితో పాటు జబర్ధస్త్ నటులు హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్, గెటప్ శీను, తదితరులు ప్రచారంలో పాల్గొంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్(Pawan Kalyan) రాజకీయ మద్దత్తును ప్రకటిస్తూ అతని సోదరుడు, మెగాస్టార్ చిరంజీవి ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేసారు. చిరంజీవి పోస్ట్ చేసిన వీడియోను తన ఎక్స్‌ వేదికగా షేర్ చేసిన రామ్‌చరణ్‌ ‘భవిష్యత్‌ కోసం పాటుపడే నాయకుడు పవన్‌ కళ్యాణ్‌ను గెలిపించండి’ అని పోస్ట్‌ చేశారు. జనసేన పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు హీరో నాని ప్రకటించారు. ‘పవన్‌ కళ్యాణ్‌… మీరు పెద్ద రాజకీయ యుద్ధాన్ని ఎదుర్కోనున్నారు. మీ సినిమా కుటుంబ సభ్యుడిగా మీరు కోరుకున్న విజయాన్ని సాధించాలని ఆశిస్తున్నా’ అని పేర్కొన్నారు.

‘ఆంధ్రప్రదేశ్‌ శ్రేయస్సు కోసం మీ కృషిని, ప్రయత్నాలను మొదటి రోజు నుంచి చూస్తున్నాను. కోట్ల మందికి మీరు ఆశాదీపం. మీరు గెలిచి ప్రజల తలరాతలు మార్చాలని కోరుకుంటున్నాను. ఇప్పటి జనాలకు మీరు కావాలి’ అని హీరో రాజ్ తరుణ్ జనసేనకు సపోర్ట్‌ చేశారు. అలాగే పవన్‌(Pawan Kalyan)కు మద్దతు తెలుపుతున్నట్లు యువ నటుడు తేజ సజ్జా తన ఇన్‌ స్టాలో స్టోరీ పెట్టారు. వరుణ్‌తేజ్‌, సాయిధరమ్‌ తేజ్‌ ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో పాల్గొనగా, హాస్య నటులు ఆది, గెటప్‌ శ్రీను తదితరులు పవన్‌కు మద్దతుగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. నటుడు సంపూర్ణేష్‌ బాబు కూడా పవన్‌కు మద్దతుగా ట్వీట్ చేశారు.

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ కు రాజకీయ మద్దతు తెలుపుతూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్… తాజాగా తన సోషల్ మీడియా ఎక్స్ వేదిక పోస్ట్ చేసారు. ‘‘పవన్‌ కళ్యాణ్‌గారి ఎన్నికల ప్రయాణం విజయవంతంగా సాగాలని కోరుకుంటూ హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మీరు ఎంచుకున్న మార్గం, సేవ చేయాలన్న నిబద్ధత పట్ల నేను ఎంతో గర్విస్తున్నా. ఒక కుటుంబ సభ్యుడిగా నా ప్రేమ, మద్దతు ఎప్పటికీ మీకే ఉంటాయి. మీ ఆకాంక్షలు, లక్ష్యాలు నెరవేరాలని కోరుకుంటున్నా’’ అని ఈ పోస్ట్ లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ వీడియోలో వైరల్ గా మారుతోంది.

Also Read : Karnataka SSLC Results: ‘పది’లో 625/625 మార్కులు సాధించిన కర్ణాటక విద్యార్ధిని !

Leave A Reply

Your Email Id will not be published!