#KeanuReeves : కియాను రీవ్స్ హాలీవుడ్ స్టార్ దాతృత్వంలో గ్రేట్

కియాను రీవ్స్ రీల్ హీరో కాదు రియ‌ల్ హీరో

Keanu Reeves  : ఒక్కొక్క‌రిది ఒక్కో క‌థ‌. హాలీవుడ్‌లో స్టార్‌డ‌మ్ ఒక్క‌సారి వ‌స్తే చాలు..ఇక వందేళ్లు హాయిగా బ‌తికేయొచ్చు. క‌ళ్లు చెదిరే సంపాద‌న‌..లెక్క‌లేనంత మంది ఫాలోయింగ్. నీడ‌లా వెంటాడే ప‌బ్లిసిటీ. వీట‌న్నింటిని కాద‌నుకుని తాను ప‌డిన క‌ష్టాల‌ను గుర్తు చేసుకుంటూ ..ఆస్ప‌త్రులలో బాధితుల ఆరోగ్యం మెరుగు ప‌డేందుకు స‌హాయం చేస్తూ..త‌న జన్మ‌ను సార్థ‌కం చేసుకుంటున్నాడు ఈ హీరో.

ఒక్క సినిమా హిట్ అయితే చాలు ..జ‌నానికి దూరంగా ..తామేదో సూప‌ర్ హీరోస్ మంటూ ఫీల్ అయ్యే టాలీవుడ్ హీరోలు రీవ్స్‌ను చూసి నేర్చుకోవాల్సింది చాలా వుంది. కియాను రీవ్స్ (Keanu Reeves )జీవితమంతా క‌ష్టాల‌మ‌య‌మే. మూడేళ్ల‌ప్పుడు తండ్రి నిర్దాక్షిణ్యంగా వ‌దిలేశాడు. ఆ త‌ర్వాత తాను ప్రాణ‌ప్ర‌దంగా ప్రేమించిన ప్రియురాలిని రోడ్డు యాక్సిడెంట్‌లో పోగొట్టుకున్నాడు.

త‌న‌కు అండ‌గా ఉన్న స్నేహితుడిని కోల్పోయాడు. త‌న చెల్లెలు రోగ పీడితురాలు. ఆమె కోలుకోవ‌డంతో కొంత ఊపిరి పీల్చుకున్నాడు. ఇన్ని అడ్డంకుల‌ను ఎదుర్కొన్న రీవ్స్(Keanu Reeves )..ఫీనిక్స్ ప‌క్షి లాగా అన్నింటిని దాటుకుని హాలీవుడ్‌లో టాప్ హీరోగా స్థానం పొందాడు. ఆయ‌న న‌టించిన ద మ్యాట్రిక్స్ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా కోట్లు కుమ్మ‌రించేలా చేసింది.

ఈ సినిమాతో పాటు స్పీడ్, జాన్ విక్, త‌దిత‌ర మూవీస్ రీవ్స్‌ను టాప్ స్టార్‌గా నిలబెట్టాయి. 54 ఏళ్ల వ‌య‌సు క‌లిగిన ఈ యాక్ట‌ర్‌కు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ఇసుక వేస్తే రాల‌నంత జ‌నం ఆయ‌న ఎక్క‌డికైనా వెళితే పోగ‌వుతారు. అత‌డికున్న ఫాలోయింగ్ అది. లైఫంతా ట్రాజెడీతోనే సాగింది రీవ్స్‌ది.

లెక్క‌లేనంత‌గా సంపాదించిన దాంట్లోంచి ఏకంగా 70 శాతానికి పైగా దాన‌ధ‌ర్మాల‌కే వెచ్చించాడు ఈ న‌టుడు. లాస్ వేగాస్‌లో జ‌రిగిన సినిమాకాన్ బిగ్ స్క్రీన్ అచీవ్‌మెంట్ అవార్డుల ప్ర‌దానోత్స‌వంలో ఆయ‌న సెంట‌ర్ ఆఫ్ ది అట్రాక్ష‌న్‌గా నిలిచారు. వాన్‌గ్వార్డ్ పుర‌స్కారాన్ని అందుకున్నారు. చ‌దువంటే ఇష్టం రీవ్స్‌కు.

డిఫరెంట్ స్కూళ్ల‌లో చ‌దివాడు. ఆయ‌న కూడా వ్యాధితో బాధ‌ప‌డ్డాడు. 23 ఏళ్ల‌ప్పుడు ఫ్రెండ్ ను పోగొట్టుకున్నాడు. చెల్లెలు లుకేమియా వ్యాధికి లోనైంది. ఆ త‌ర్వాత కోలుకుంది. డిజైనింగ్ షాపులో అసిస్టెంట్‌గా ప‌నిచేశాడు. హాలీవుడ్‌లోకి క‌ష్టంగా ఎంట‌ర్ అయ్యాడు. 30 డిఫ‌రెంట్ సెట్స్‌ల‌లో ప‌నిచేశాడు.

2009లో పిల్ల‌ల కోసం ఓ ఫౌండేష‌న్‌ను ఏర్పాటు చేశాడు రీవ్స్. క్యాన్స‌ర్ వ్యాధితో బాధ‌ప‌డుతున్న పిల్ల‌ల కోసం తాను సంపాదించిన దాంట్లోంచి 70 శాతానికి పైగా ఖ‌ర్చు చేస్తున్నాడు ఈ హీరో. రీవ్స్(Keanu Reeves )ద‌గ్గ‌ర లెక్క‌నేంత సంప‌ద పోగైంది. ఆయ‌న పేరే ఓ బ్రాండ్. త‌న విలువ ఇప్ప‌టిక‌ప్పుడు లెక్కిస్తే 100 కోట్ల మిలియ‌న్ డాల‌ర్లు. అన్నింటిని వ‌దిలేసుకున్నాడు ఈ హీరో.

సింపుల్‌గా ఉండడం. సాధార‌ణ దుస్తులు ధ‌రించ‌డం. ఎక్కువ‌గా ఖ‌ర్చు చేయ‌క పోవ‌డం ..ఉన్న‌దాంట్లోనే స‌ర్దు కోవ‌డం రీవ్స్ దిన‌చ‌ర్య‌గా మారింది. ఎంత స‌మ‌కూరినా అంతా పిల్ల‌ల కోస‌మే బ‌దిలీ చేస్తూ త‌న‌లో మాన‌వ‌త్వం బ‌తికే వుంద‌ని నిరూపిస్తున్నాడు ..ద గ్రేట్ హీరో రీవ్స్(Keanu Reeves ).

మ‌న‌కు కూడా ఇలాంటి హీరోలు వుంటే ఎంత బావుంటుంది క‌దూ..గొప్ప‌వాళ్లు ఆకాశం నుంచి ఊడి ప‌డ‌రు..కానీ మ‌న‌మ‌ధ్య‌నే వుంటారు. మ‌న‌తో పాటే న‌డుస్తారు. కానీ వారి అడుగులు స‌మాజం కోసం సాగిపోతాయి. మ‌నం మాత్రం ఇక్క‌డే నిలిచి పోతాం.

No comment allowed please